బకాయి డబ్బులు అడిగినందుకు ఇద్దరు కూలీల దారుణ హత్య..

Published : Jul 10, 2023, 07:13 AM IST
బకాయి డబ్బులు అడిగినందుకు ఇద్దరు కూలీల దారుణ హత్య..

సారాంశం

శనివారం సాయంత్రం మొరాదాబాద్‌-రాంపూర్‌ జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు ఇద్దరు కూలీలపై పదునైన ఆయుధాలతో దాడి చేసి, హత్య చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ : పెండింగ్ బకాయిల విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, ఒకరు కనిపించలేదు.

శనివారం సాయంత్రం మొరాదాబాద్‌-రాంపూర్‌ జాతీయ రహదారిపై సద్దాం, ఇర్ఫాన్‌, సత్‌వీర్‌ నుంచి డబ్బు వసూలు చేసేందుకు వచ్చిన ముర్తజా (53), కల్లు (58)పై ఆ ముగ్గురు పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు వారు తెలిపారు.

ఈ దాడిలో ముర్తజా అక్కడికక్కడే మృతి చెందగా, కల్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సద్దాం, సత్వీర్‌లను శనివారం రాత్రి అరెస్టు చేశామని, ఇర్ఫాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సన్సార్ సింగ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial