ఏ దిక్కూ లేక అనాథాశ్రమంలో చేరితే.. నలుగురు బాలికలపై అత్యాచారం

By Siva KodatiFirst Published Aug 13, 2019, 7:39 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా సమయనల్లూరులోని మాసా ట్రస్టు తరపున అనాథ బాలల సంరక్షణ కేంద్రం నడుస్తోంది. ఇందులో సుమారు 25 మంది వరకు అనాథ బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఏ దిక్కు లేక అనాథాశ్రమంలో చేరిన వారిని.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. నలుగురు అనాథ బాలికలపై అత్యాచారం చేశాడు

ఏ దిక్కు లేక అనాథాశ్రమంలో చేరిన వారిని.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. నలుగురు అనాథ బాలికలపై అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా సమయనల్లూరులోని మాసా ట్రస్టు తరపున అనాథ బాలల సంరక్షణ కేంద్రం నడుస్తోంది.

ఇందులో సుమారు 25 మంది వరకు అనాథ బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. కరుమాత్తూరుకు చెందిన జ్ఞానప్రకాశం, ఆదిశివన్‌లకు ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

అయితే తమను వారు లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు బాలికలు జిల్లా బాలల సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు అక్కడికి వెళ్లి విచారణ నిర్వహించారు.

దీనిలో భాగంగా నలుగురు బాలికలు అత్యాచారాకి గురైనట్లు తెలిసింది. షణ్ముగానికి దారుణం గురించి చెప్పే సమయంలో సదరు బాలికలు కంటతడి పెట్టారు. అత్యాచారం జరిగినట్లు ఎవరికైనా చెబితే ఆదిశివన్ చంపేస్తానని బెదిరించినట్లు బాలికలు వాపోయారు.  

దీంతో వారిని మధురై మత్తుపట్టిలో ఉండే బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. షణ్ముగం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఆదిశివన్‌ను అరెస్ట్ చేసి.. మరో నిర్వాహకుడు జ్ఞాన ప్రకాశంను విచారిస్తున్నారు. 

click me!