డిల్లీలో మరో దారుణం...ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Published : Oct 02, 2018, 06:16 PM IST
డిల్లీలో మరో దారుణం...ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

సారాంశం

దేశ రాజధాని డిల్లీలో రోజురోజుకు అమ్మాయిలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత ఈ అఘాయిత్యాలు ఆగుతాయని భావించారు. కానీ కామాంధుల ఆగడాలకు ఈ చట్టం ఆపలేకపోతోంది. మరీ ముఖ్యంగా డిల్లీ వంటి మెట్రోపాలిటిన్ నగరాల్లో యువతులపై, చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. 

తాజాగా ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై పక్కింట్లో వుండే 15 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ సంఘటన డిల్లీలో వెలుగుచేసింది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.  

ఈ అఘాయిత్యంపై నగర డిప్యూటి పోలీస్ కమీషనర్ అస్లాం ఖాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం నార్త్ డిల్లీ స్వరూప్ నగర్ లోని ఓ ఇంట్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లోని యువకుడు చిన్నారిపై అత్యాచార యత్నం చేశాడు. అయితే చిన్నారి అతడిని ప్రతిఘటించింది. దీంతో ఆ యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. 

తల్లిదండ్రులు ఇంటికి రాగానే చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?