కిరణ్ బేడీ-ఎమ్మెల్యే మధ్యఫైట్: సభ నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే డిమాండ్(వీడియో)

By Nagaraju TFirst Published Oct 2, 2018, 6:14 PM IST
Highlights

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎమ్మెల్యేకు మధ్య ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

ఉప్పలం : పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎమ్మెల్యేకు మధ్య ఫైట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కిరణ్‌ బేడీ హయాంలో తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంబలగన్ కు సర్ధిచెప్పేందుకు కిరణ్ బేడీ ప్రయత్నించినా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. విమర్శల దాడి కొనసాగించారు.  

స్వయంగా బహిరంగ సభలో తన పనితీరును ఎమ్మెల్యే తప్పుబట్టడంతో కిరణ్ బేడీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఎమ్మెల్యే మైక్‌ను కట్‌ చేయాలని ఆమె అధికారులకు సూచించారు. 

దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆమెపై గట్టిగా కేకలు వేశారు. దీంతో వేదిక దిగి వెళ్లిపోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదేపదే కోరినా నిరాకరించిన ఎమ్మెల్యే కిరణ్‌ బేడీనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్‌ విమర్శల దాడి చేయడం కొత్తేమీ కాదు. పుదుచ్చేరిలో అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్న బేడీని కేంద్రం వెనక్కిపిలవాలని ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 

Verbal spat on stage between Puducherry Governor Kiran Bedi and AIADMK MLA A Anbalagan at a government function. The argument reportedly broke out over duration of MLA's speech pic.twitter.com/bptFSr80nC

— ANI (@ANI)
click me!