రాజకీయాలకు రమ్య గుడ్ బై..?

Published : Dec 14, 2018, 04:00 PM IST
రాజకీయాలకు రమ్య గుడ్ బై..?

సారాంశం

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య.. రాజకీయాలకు శాశ్వంతగా వీడ్కోలు చెప్పనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య.. రాజకీయాలకు శాశ్వంతగా వీడ్కోలు చెప్పనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. సినీ కెరీర్ బిజీగా ఉన్న క్రమంలోనే రమ్య.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  అయితే.. ఇప్పుడు మళ్లీ  రాజకీయాలను వదిలేసి.. తిరిగి సినిమాల్లో నటించాలని భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

తన రాజకీయ గురువు అంబరీష్‌ చివరిచూపులకు కూడా రాలేనంత అనారోగ్యంతో బాధపడుతున్న రమ్య.. కర్ణాటక రాజకీయాలతో విసిగిపోయిందట. అందుకే.. ఇక రాజకీయాలకు రాం రాం చెప్పేద్దామనుకుంటున్నట్లు తన సన్నిహితులతో చెప్పిందట. అందుకే కొంతకాలంగా రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది.

కొద్ది రోజుల్లో అధికారికంగా..తాను సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను అనే విషయాన్ని రమ్య ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu