రామ్ దేవ్ బాబా : వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతి మీద మళ్లీ విమర్శలు....

By AN TeluguFirst Published May 31, 2021, 9:18 AM IST
Highlights

వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతి మీద యోగా గురువు రాందేవ్ బాబా మళ్లీ విమర్శలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన వేసుకున్నా, కొందరు మరణిస్తున్నారని, అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు చేశారు. 

వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతి మీద యోగా గురువు రాందేవ్ బాబా మళ్లీ విమర్శలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన వేసుకున్నా, కొందరు మరణిస్తున్నారని, అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు చేశారు. 

కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్ తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 10 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు. 

‘రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విదానంతో పోల్చుతూ.. కొందరు ఉద్దేశపూర్వంగా తక్కువ చేసి చూపిస్తున్నారు’ అంటూ రాందేవ్ బాబా తీవ్రంగా మండిపడ్డారు. 

కాగా,  ఆలోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రామ్ దేవ్ బాబా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన ఆ విషయం తెలిపారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలోపతి వైద్యులను అవమానించే విధంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఎ) విరుచుకుపడింది. దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

అలోపతి వైద్యులపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ ఆయన రామ్ దేవ్ బాబాకు ఓ లేఖ రాశారు. దాంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. హర్షవర్ధన్ ను ఉద్దేశిస్తూ తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు. 

"మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తన్నారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను" అని రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు.

ఆధునిక వైద్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు.  హర్షవర్ధన్ కు ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేసిన 8 నిమిషాల తర్వాత రామ్ దేవ్ బాబు మరో ట్వీట్ చేశారు. యోగా, ఆయుర్వేదం పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఆధునిక వైద్య శాస్త్రానికి పరిమతులు ఉన్నాయని ఆయన అన్నారు. 

click me!