కామ పిశాచి: కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

Published : May 31, 2021, 08:14 AM ISTUpdated : May 31, 2021, 08:15 AM IST
కామ పిశాచి: కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

సారాంశం

మానవత్వాన్ని మంట గలిపి ఓ కామ పిశాచి కూతురిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. అతని నుంచి పారిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

భువనేశ్వర్: ఓ వ్యక్తి మానవత్వానికి మచ్చ తెచ్చాడు. మానవ సంబంధాలను మట్టి కలుపుతూ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కూతురిపైనే ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బొబ్బిలి డిఎఎస్పీ బి. మోహన్ రావు సనివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

బొండపల్లి మండలం వెదురువాడ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి తన కూతురిపై మూడు సార్లు అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. మేనత్త ఇంటికి వెళ్దామని చెప్పి కూతురిని మోటార్ సైకిల్ మీద తీసుకుని వెళ్తూ మార్గమధ్యంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

మరోసారి కాలేజీ నపి మీద వెళ్లాలంటూ తీసుకుని వెళ్లి మార్గమధ్యంలో అత్యాచారం చేశాడు. పదో తరగతి చదువుతునన ఆ బాలిక ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటోంది. రెండు రోజుల క్రితం పోడు వ్యవసాయం కోంస పొలానికి వెళ్దామని కూతురిని రమ్మన్నాడు. తనను ఎందుకు రమ్మంటున్నాడో పసిగట్టిన బాలిక అందుకు నిరాకరించింది. 

చంపేస్తానని బెదిరించడంతో తండ్రిని రాయితో కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఇంటికి వెళ్లకుండా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దాంతో శుక్రవారం అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతనిపై పోక్సో చట్టం కిందనే కాకుండా అత్యాచారం కేసులు కూడా నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు