కర్ణాటక సంక్షోభం...సీఎం కుమారస్వామికి ఊరట

By telugu teamFirst Published Jul 18, 2019, 10:13 AM IST
Highlights

ఈ రోజు ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. విధాన సభలో మొత్తం 224మందంి సభ్యులు ఉన్నారు. 16మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కాస్త ఊరట లభిచింది. కర్ణాటక విధాన సభలో నేడు బలపరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ క్రమంలో అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వానికి బలం పెరిగినట్లు అయ్యింది. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామాలను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే... కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించనుంది. 

ఈ రోజు ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. విధాన సభలో మొత్తం 224మందంి సభ్యులు ఉన్నారు. 16మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. తాజాగా రామలింగారెడ్డి తన రాజీనామా వెనక్కి తీసుకోవడంతో మళ్లీ సభ్యుల సంఖ్య 209కి చేరింది.

అధికారంలోకి రావాలంటే... 105 మేజిక్ ఫిగర్ ఉండాలి. ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వ బలం 102కి పడిపోయింది. మరోవైపు బీజేపీకి 105 ఎమ్మెల్యేల బలం ఉంది. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.దీంతో బీజేపీ బలం 107గా ఉంది. మరికాసేపట్లో ప్రారంభంకానున్న బలపరీక్షలో 105 సభ్యుల మద్దతు నిరూపించుకోని పక్షంలో కుమారస్వామి సీఎం కుర్చీని వదిలేయాల్సి ఉంటుంది. ఈలోపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటే... సంకీర్ణ ప్రభుత్వం తమ అధికారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. 
 

click me!