భారత్‌ విజయం: కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ తీర్పు

By narsimha lodeFirst Published Jul 17, 2019, 6:34 PM IST
Highlights

కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ కోర్టు బుధవారం నాడు  కోర్టు తీర్పును వెలువరించింది.

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ కోర్టు బుధవారం నాడు  కోర్టు తీర్పును వెలువరించింది..

కుల్‌భూషణ్‌ కేసులో అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు ఊరట లభించింది. కుల్‌భూషణ్ కు విధించిన మరణశిక్షను పున:సమీక్షించాలని  ఐసీజే కోరింది.ఐసీజేలో న్యాయమూర్తుల్లో 16 మందిలో 15 మంది భారత్‌కు అనుకూలంగా మద్దతిచ్చారు.  న్యాయవాదిని నియమించుకొనే  హక్కు  భారత్‌కు ఉందని ఐసీజే కోర్టు తెలిపింది.

2016 మార్చి 3వ తేదీన కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అధికారులు బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేశారు. పాక్‌లో గూఢచర్యానికి దిగుతున్నాడనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 20 రోజుల తర్వాత ఇండియాకు పాక్ ప్రభుత్వం ఇచ్చింది.అయితే ఎందుకు ఈ ఆలస్యమైందనే విషయమై పాక్ ప్రభుత్వం సమాచారం .

ఇవ్వలేదు.గూఢచర్యం చేశాడని పాక్ మిలటరీ కోర్టు 2017 ఏప్రిల్ లో కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించింది.  ఈ విషయం తెలిసిన ఇండియా అంతర్జాతీయ న్యాయ స్థానంలో 2017 మేలో పిటిషన్ దాఖలు చేసింది.

కుల్‌భూషణ్ జాదవ్‌ కు శిక్షను ఖరారు చేయడంలో  పాక్ ప్రభుత్వం అన్ని రకాల అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించిందని  భారత్ ఆరోపించింది.భారత పౌరుడిగా ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం దృస్టికి తీసుకెళ్లింది.ఈ విషయమై ఇవాళ అంతర్జాతీయ కోర్టులో కుల్‌భూషణ్ జాదవ్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 

click me!