బీహార్‌లో రామ నవమి ఘర్షణలు... 14 మందికి గాయాలు, 20 మంది అరెస్ట్

Published : Apr 01, 2023, 01:38 PM IST
బీహార్‌లో రామ నవమి ఘర్షణలు... 14 మందికి గాయాలు, 20 మంది అరెస్ట్

సారాంశం

పోలీసులు, పరిపాలనాధికారులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలంలో మోహరించారు. జిల్లాలో భద్రతను పెంచారు. పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు.

బీహార్ : మార్చి 31న రామనవమి ఊరేగింపు నేపథ్యంలో బీహార్‌లోని నలంద జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 20 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శనివారం తెలిపారు. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని నలంద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నలంద జిల్లా కేంద్రంగా ఉన్న బీహార్‌షరీఫ్‌లోని లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ దివాన్ సమీపంలో రామనవమి వేడుకల 10వ రోజున ఘర్షణ జరిగింది. గుంపులో కొందరు రాళ్లు రువ్వి అరడజను వాహనాలకు నిప్పు పెట్టారు.

పోలీసులు, పరిపాలనాధికారులు సంఘటనా స్థలంలో మోహరించారు, జిల్లాలో భద్రతను పెంచారు. పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. మార్చి 31న ఘర్షణ జరిగినట్లు నివేదించిన బీహార్‌లోని నలంద, ససారంలో కూడా సెక్షన్ 144 (నిషేధ ఉత్తర్వులు) విధించారు.వదంతులను నమ్మవద్దని, శాంతి భద్రతలను కాపాడాలని నలంద పోలీసు సూపరింటెండెంట్ అశోక్ మిశ్రా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హౌరాలో రాళ్లు రువ్విన వారికి మమతా బెనర్జీ క్లీన్ చిట్ ఇస్తున్నారు - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

14 మందిని ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో ముగ్గురిని పాట్నాకు రిఫర్ చేసినట్లు నలందలోని సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ విశ్వజీత్ కుమార్ తెలిపారు. "14 మందిని ఇక్కడికి తీసుకువచ్చారు. వారిలో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి, వీరిలో ముగ్గురిని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఒక వ్యక్తిని ఐసియులో చేర్చారు. అందరూ నిలకడగా ఉన్నారు" అని డాక్టర్ విశ్వజీత్ కుమార్ తెలిపారు.

శుక్రవారం రామనవమి ఊరేగింపు అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పుపెట్టడం కూడా జరిగాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా ఘటన వివరాలను తెలుసుకుంటున్నామని నలంద డీఎం శశాంక్ శుభంకర్ తెలిపారు. సాక్ష్యాధారాల ఆధారంగా అక్రమార్కులను గుర్తిస్తామని, వారిని విడిచిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
 

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu