Karnataka: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైల్, రూ. 10 కోట్ల ఫైన్.. తెలంగాణకూ వస్తుందా?

By Mahesh K  |  First Published Dec 7, 2023, 2:23 AM IST

పోటీ పరీక్షల్లో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే రూ. 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను విధించేలా కఠిన చర్యలు తీసుకునేలా ఓ బిల్లును కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
 


బెంగళూరు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరంగా కావడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగం ఒక కీలకమైన అంశంగా ఉన్నది. తెలంగాణలో పోటీ పరీక్షల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందర్భంలో చర్చనీయాంశమైన సంగతీ తెలిసిందే. ఈ తరుణంలోనే కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ఓ బిల్లు తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది.

ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం ఓ కఠినమైన చట్టం తీసుకురావాలని అనుకుంది. ఇందుకు సంబంధంచి బిల్ులును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నియామక పరీక్షల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే.. వారి నేరం నిరూపితమైతే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల జరిమానా విధించాలని ఆ బిల్లు చెబుతున్నది. 

Latest Videos

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.  రాష్ట్ర ప్రభుత్వం సహా స్వయం ప్రతిపత్తి సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో భర్తీ కోసం నిర్వహించే పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ, భర్తీ ప్రక్రియలో అక్రమ మార్గాలను ఎంచుకోవడం, అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ బిల్లు చెబుతున్నది. 

Also Read: Vote Share: కమ్యూనిస్టులు బీజేపీని ఎదుర్కోగలరా? మూడు అసెంబ్లీ ఎన్నికలు మనకు చెప్పే పాఠం ఏమిటీ?

ఈ బిల్లు తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించడానికి కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం కూడా కృషి చేసింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వంటిదే తెలంగాణలోనూ తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది.

click me!