ఐదువేల వజ్రాలతో రామ్ మందిర్ థీం నెక్లెస్.. సూరత్ వ్యాపారి వినూత్న ప్రయోగం..

By SumaBala Bukka  |  First Published Dec 19, 2023, 10:09 AM IST

ఈ నెక్లెస్ ను తయారు చేయడం కోసం రెండు కిలోల వెండిని, దాదాపు 5000 అమెరికన్ డైమండ్స్ ను ఉపయోగించినట్లుగా సమాచారం. ఈ నెక్లెస్ లో  అయోధ్య రామ మందిరం.. సీతారామ లక్ష్మణులు…ఆంజనేయుడు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 


సూరత్ : అయోధ్య రాముడుపై ఉన్న భక్తిని ఓ వజ్రాల వ్యాపారి తనదైన శైలిలో చాటుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐదువేల అమెరికన్ డైమండ్స్ ని ఉపయోగించి రామాలయం థీమ్ తో నెక్లెస్ ను తయారు చేశాడు. ఈ నెక్లెస్ చూడడానికి అచ్చం రామాలయంలాగే ఉంటుంది. ఈ వజ్రాభరణాన్ని అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మందిరానికి బహుమతిగా ఇవ్వనున్నాడు. దీని తయారీ కోసం 35 రోజులపాటు 40 మంది కళాకారులు పనిచేశారు.

ఈ నెక్లెస్ ను తయారు చేయడం కోసం రెండు కిలోల వెండిని, దాదాపు 5000 అమెరికన్ డైమండ్స్ ను ఉపయోగించినట్లుగా సమాచారం. ఈ నెక్లెస్ లో  అయోధ్య రామ మందిరం.. సీతారామ లక్ష్మణులు…ఆంజనేయుడు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెక్లెస్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. దీనిని సూరత్ కు చెందిన  రసేష్ జ్యువలరీస్ తయారు చేసింది. దీని డైరెక్టర్ కౌశిక్ కాకడియా వివరాలు చెబుతూ… అయోధ్య రామమందిరం నిర్మాణంతో పూర్తి పొందామని.. అలాగే నగను రూపొందిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించామని తెలిపారు. 

Latest Videos

తన ఆలోచనను కార్యరూపంలో పెట్టి రెండు కిలోల వెండితో 5000 కంటే ఎక్కువగా వజ్రాలను ఉపయోగించి ఈ నెక్లెస్ ను తయారు చేసినట్లుగా తెలిపాడు. దీనిని అమ్మకానికి పెట్టడం లేదని.. కేవలం  రామాలయానికి బహుమతిగా ఇవ్వడం కోసమే రూపొందించినట్లుగా తెలిపారు. తమ జ్యువెలర్స్ తరఫున రామాలయానికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నానని.. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలోనే ఈ నెక్లెస్ తయారీ ఐడియా వచ్చిందని తెలిపారు. నెక్లెస్ లో రామాలయంలోని ప్రధాన పాత్రలన్నింటినీ చేక్కామని చెప్పుకొచ్చారు. 

 

| Surat, Gujarat: A diamond merchant from Surat has made a necklace on the theme of the Ram temple using 5000 American diamonds and 2 kg silver. 40 artisans completed the design in 35 days. pic.twitter.com/nFh3NZ5XxE

— ANI (@ANI)
click me!