అయోధ్య రామమందిరానికి భూమి పూజ : ముహూర్తం పెట్టిన పూజారికి బెదిరింపు కాల్స్

By Siva KodatiFirst Published Aug 4, 2020, 4:43 PM IST
Highlights

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపధ్యంలో ఇందుకు ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపధ్యంలో ఇందుకు ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరగనున్న రామ మందిర నిర్మాణం భూమి పూజకు ముహార్తాన్ని నిర్ణయించారు. బెళగావిలో ఉండే విజయేంద్ర శర్మ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ గిరిజకి సన్నిహితులు.

Also Read:ముస్లిం యువతి రామ భక్తి.. టాటూగా వేయించుకొని..

విజయేంద్రకు గత మూడు, నాలుగు రోజులుగా 60 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు ఈ కాల్స్ వచ్చినట్లు విజయేంద్ర శర్మ పేర్కొన్నారు. దీంతో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

గతంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావులకు శర్మ సలహాదారుగా వ్యవహరించారు. అంతేకాకుండా వాజ్‌పేయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనూ శర్మనే ముహూర్తం పెట్టారు. కాగా బుధవారం జరగనున్న రామ మందిర భూమి పూజకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
 

click me!