మళ్లీ అప్పుడొస్తా, 28 ఏళ్ల క్రితం మోడీ సంకల్పం: నేడు సాకారం చేసుకొంటున్న ప్రధాని

By narsimha lodeFirst Published Aug 5, 2020, 11:01 AM IST
Highlights

 28 ఏళ్ల క్రితం తాను ప్రకటనకు అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అయోధ్యలో అడుగు పెడుతున్నాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగే సమయంలోనే అయోధ్యలో అడుగు పెడతానని 28 ఏళ్ల క్రితం మోడీ ప్రకటించారు.


న్యూఢిల్లీ: 28 ఏళ్ల క్రితం తాను ప్రకటనకు అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ అయోధ్యలో అడుగు పెడుతున్నాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగే సమయంలోనే అయోధ్యలో అడుగు పెడతానని 28 ఏళ్ల క్రితం మోడీ ప్రకటించారు.

1992 జనవరి 18వ తేదీన తిరంగా యాత్రలో భాగంగా నరేంద్ర మోడీ అయోధ్యకు వెళ్లారు.  28 ఏళ్ల క్రితం అక్కడి రామ్ లల్లాను ఆయన దర్శించుకొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగే సమయంలోనే తాను ఇక్కడికి వస్తానని ఆయన ప్రకటించారు.  అన్నట్టుగానే ఆయన సంకల్పం నెరవేర్చుకొనే రోజు ఇవాళ సాకారం కానుంది.

also read:అయోధ్య భూమి పూజ లైవ్: ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోడీ

రామ మందిర నిర్మాణ భూమి పూజను ప్రధాని హోదాలో మోడీ చేయనున్ననారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ 'తిరంగాయాత్ర'ను ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా మోడీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ 1992 జనవరి 17వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చేరుకొన్నారు. రాష్ట్రంలోని ఫైజాబాద్ సమీపంలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ కూడ పాల్గొన్నారు.

మరునాడు అంటే జనవరి 18వ తేదీన అయోధ్యలో రాముడిని ఆయన దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించే  సమయంలో మరోసారి అయోధ్యకు వస్తానని ఆయన ఆ రోజు ప్రకటించారు.
 

click me!