అయోధ్యలో అపూర్వఘట్టం.. గర్భగుడిలోకి ప్రవేశించిన రామ్ లల్లా విగ్రహం...

By SumaBala Bukka  |  First Published Jan 18, 2024, 9:23 AM IST

గురువారం తెల్లవారుజామున అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గడియలు రానే వచ్చాయి. గర్భగుడిలోకి బాలరాముడు ప్రవేశించాడు. 


అయోధ్య : గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామాలయం గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకొచ్చారు. 'జై శ్రీరామ్' నినాదాల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్టించే అవకాశం ఉందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చారు.

Latest Videos

undefined

జనవరి 22న రామాలయంలో సంప్రోక్షణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో ఏడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు బుధవారం 'కలశ పూజ' జరిగింది. ఈ ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి. సంప్రోక్షణ రోజున, రామ్ లల్లా విగ్రహం 'ప్రాణ ప్రతిష్ఠ' కోసం అవసరమైన కనీస ఆచారాలు నిర్వహించబడతాయని రామాలయం ట్రస్ట్ అధికారులు తెలిపారు.

#FactCheck: రూ.500 నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడు..!? జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారా..?

121 మంది 'ఆచార్యులు' క్రతువులను నిర్వహిస్తున్నారు. రామాలయం 'ప్రాణ ప్రతిష్ఠ' జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అయోధ్యలో 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు గ్రాండ్ ఓపెనింగ్‌కు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అదనంగా, వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు దీక్షా కార్యక్రమానికి హాజరుకానున్నారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే కళాకారుడు చెక్కిన రామ్ లల్లా విగ్రహం గర్భగుడిలో ప్రతిష్టించడానికి ఎంపిక చేయబడింది.

click me!