#FactCheck: రూ.500 నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడు..!? జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారా..?

By Rajesh Karampoori  |  First Published Jan 18, 2024, 7:44 AM IST

Ram Mandir: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ .. విగ్రహా ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా  సాగుతున్నాయి. ఈ తరుణంలో కరెన్సీ నోటుపై  మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో శ్రీరాముడు, అయోధ్య ఆలయం ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వార్తలో వాస్తవమేంతా?


Ram Mandir: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుత తరుణం రానే వచ్చింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా  సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన  బాలరాముడు శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే ప్రజలంతా రామనామస్మరణలో మునికి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట మహాత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. 
అయితే.. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగచక్కర్లు కొడుతుంది.

ఇండియన్ కరెన్సీ నోట్లపై జాతపిత మహాత్మా గాంధీ ఫోటోకు బదులు ఆ స్థానంలో శ్రీరాముడి చిత్రంతో కూడిన రూ. 500 నోట్ సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది. ఈ నోటులో ఓ వైపు రాముడు కనిపించగా.. మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయం.. స్వచ్ఛభారత్, గాంధీజీ కళ్ళజోడు స్థానంంలో రాముడు బాణం దర్శనమిస్తుంది. నెట్టింట్లో వైరలవుతున్న ఈ 500 నోటును జనవరి 22న అమలులోకి తీసుకవస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా అసత్య ప్రచారమనీ, ఇప్పటివరకు కొత్త కరెన్సీ నోటు జారీపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Latest Videos

undefined

1996లో కరెన్సీ నోట్లపై అశోకుని స్థలంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం ప్రారంభించారు. అప్పటినుంచి కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రమే ఉంటుంది. మహ్మాత గాంధీ ఫోటోను తొలగించి.. ఆ స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, డా, బీ.ఆర్ అంబేద్కర్,అబ్దుల్ కలాం లాంటి మహానీయులు ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే.. అలాంటిదేమి లేదనీ రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది.

తాజాగా శ్రీరాముడి ఫోటోతో కూడా కరెన్సీ నోట్లు తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ వైరల్ ఫోటోను పరిశీలించి చూస్తే.. ఒరిజినల్ 500 నోటును ఎడిటింగ్ చేశారని ఈజీగా  అర్థమవుతుంది. ఈ ఎడిటింగ్ ఫోటోను వాట్సప్ యూనివర్సిటీలో తెగవైరల్ అవుతోంది. కరెన్సీ విషయంలో ఆర్.బి.ఐ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఆ వార్తకు విశ్వసనీయత ఉంటుంది కాబట్టి ఎడిట్, మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫోటోలను ప్రజలు నమ్మకపోవడమే మంచిది. 

NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024

நிஜமா? 🤔🤔🤔🤔 pic.twitter.com/peiCwlr9oZ

— 😇 ✍lαthα αѕhσkrαj 🇮🇳 (@TenthPlanet1)
click me!