కాసేపట్లో బైడెన్‌తో మోడీ భేటీ: రైతుల కోసం గొంతెత్తండి.. అమెరికా అధ్యక్షుడికి రాకేశ్ తికాయత్ ట్వీట్

Siva Kodati |  
Published : Sep 24, 2021, 02:27 PM IST
కాసేపట్లో బైడెన్‌తో మోడీ భేటీ: రైతుల కోసం గొంతెత్తండి.. అమెరికా అధ్యక్షుడికి రాకేశ్ తికాయత్ ట్వీట్

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ట్వీట్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు, రైతు నేత రాకేశ్ తికాయత్. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘డియర్ పోటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్)’ అంటూ తికాయత్ ట్వీట్ చేశారు.

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గడిచిన ఏడాది కాలంగా రైతులు ఢిల్లీ, హర్యానా శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో కరోనాతో పాటు చిన్న అవరోధాలు వచ్చినా అన్నదాతలు మాత్రం మొక్కవోని దీక్షతో నిరసన కొనసాగిస్తున్నారు. అల్లర్లు, వాతావరణం, అనారోగ్యం వంటి కారణాలతో దాదాపు 700 మంది రైతులు ఆందోళన కాలంలో చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు మేలు చేసే ఆ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే రైతులతో పలు విడతలుగా సమావేశమైనా అవీ ఓ కొలిక్కి రాలేదు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ట్వీట్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు, రైతు నేత రాకేశ్ తికాయత్. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘డియర్ పోటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్)’ అంటూ తికాయత్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో రైతులందరం 11 నెలలుగా ఆందోళన చేస్తున్నామని.. ఇప్పటివరకు 700 మంది రైతులు చనిపోయారని.. తాము బాగుపడాలంటే ఈ నల్లచట్టాలు రద్దు కావాలని తికాయత్.. జో బైడెన్‌కు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే ముందు తమ సమస్యలపైనా ఓసారి ఆలోచించాలని..రైతుల గురించి గొంతెత్తాలని రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!