న్యూఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు: గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి సహా నలుగురు మృతి

By narsimha lodeFirst Published Sep 24, 2021, 2:06 PM IST
Highlights

ఢిల్లీ రోహిణి కోర్టు ఏరియాలో శుక్రవారం నాడు జరిగిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ సహా మరో నలుగురు మృతి చెందారు. కోర్టుకు జితేందర్ ను తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.కోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగింది. నిందితులు ఆయుధాలతో కోర్టులోకి ఎలా ప్రవేశించారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


న్యూఢిల్లీ: ఢిల్లీ రోహిణి కోర్టు( Delhi Rohini court) ఏరియాలో శుక్రవారం నాడు జరిగిన కాల్పుల్లో (firing) గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి  (jitender gogi)సహా మరో నలుగురు మరణించారు.గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి ని కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో  కాల్పులు చోటు చేసుకొన్నాయి. 

ఢిల్లీ కోర్టులోని రూమ్ నెంబర్ 207లో కాల్పులు చోటు చేసుకొన్నాయి. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన కొందరు  దుండగులు నిందితులు జితేందర్ పై కాల్పులు జరిపారు.ఓ కేసు విషయంలో ఢిల్లీ కోర్టుకు వచ్చాడు జితేందర్.  జితేందర్ ను ప్రత్యర్ధులు కాల్పులు జరిపారు. జితేందర్  అనుచరులు కూడ ప్రత్యర్ధులపై కాల్పులకు దిగారు.  ఈ ఘటనలో  ప్రత్యర్ధులు ఇద్దరు కూడ మరణించారు. ఈ ఘటనలో జితేందర్ న్యాయవాది కూడ గాయపడ్డారు.
కాల్పుల ఘటనలో పలువురు గాయపడినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనతో కోర్టుకు హాజరైన న్యాయవాదులు కక్షిదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీ కోర్టులోకి ప్రత్యర్ధులు ఎలా ఆయుధాలు తీసుకొచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఏడాది మార్చిలో గురుగ్రామ్ లో జితేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  తన కాలేజీ రోజుల్లో కాలేజీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయమై జితేందర్ గోగి  తో గొడవ జరిగింది. అప్పటి నుండి జితేందర్ గ్యాంగ్ స్టర్ అవతారమెత్తాడు.

2015లో జితేందర్ గోగి అరెస్టయ్యారు. ఆయనను తీహార్ జైలులో ఉంచారు. అయితే సోనిపట్ జైలు ఖైదుగా ఉణ్న టిల్లును చంపాలని 2016లో జితేందర్ జైలు నుండి తప్పించుకోవడానికి చేసిన ప్లాన్ బెడిసి కొట్టి అతని స్నేహితులు అరెస్టయ్యారు.

click me!