నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు: ఆమోదం తెలిపిన రాజ్యసభ

By narsimha lodeFirst Published Nov 29, 2021, 2:29 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లుకు రాజ్యసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో  ఈ బిల్లుకు ఆమోదించింది. ఈ సమయంలో విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. ఈ బిల్లును పాస్ చేసిన  వెంటనే రాజ్యసభను వాయిదా వేశారు.

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును సోమవారం నాడు మూజువాణి ఓటుతో ఆమోదించింది. అంతకు ముందు ఇదే బిల్లును లోక్‌సభ  కూడా ఆమోదం తెలిపింది.  నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు ఏడాది కాలంగా రైతులు ఢిల్లీకి సమీపంలో ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు విపక్షాలు కూడా మద్దతును ప్రకటించాయి.  దీంతో  నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇదే విషయాన్ని ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

గత వారంలో నిర్వహించిన  Union Cabinet సమావేశంలో  New Farm Laws రద్దు చేయడానికి సంబందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఇవాళ తొలుత లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. Loksabha మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మరో వైపు Rajya Sabhaలో  కూడా ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించే సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే  ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

also read:Farm Laws Repeal Bill: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మరో వైపు Rajya Sabhaలో  కూడా ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించే సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే  ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.  మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై చర్చకు కేంద్రం ఎందుకు వెనుకాడుతుందని  కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే ఈ విషయమై చర్చకు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

2020 సెప్టెంబర్ మాసంలో  మూడు వ్యవసాయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుపై ఆమోదం తెలిపే సమయంలో విపక్ష సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విపక్ష సభ్యులు రాజ్యసభలో  ఆందోళనకు దిగారు.  ఆ సమయంలో రాజ్యసభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఆమోదం తెలిపేందుకు అధికార పార్టీ వ్యవహరించిన తీరును విపక్షాలు అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టాయి.  

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  ఏడాది కాలంగా  దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా కూడా మారాయి.  యూపీలోని లఖీంపూర్ ఖేరీలో  రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో  కేంద్ర మంత్రి తనయుడు అశిష్ మిశ్రా  కారు నడపడంతో పెద్ద ఎత్తున  రైతులు మరణించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఘటనలో ఆశిష్ మిశ్రా అరెస్టయ్యాడు.  మరో వైపు ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కూడా విపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

click me!