అందమైన ఎంపీలతో.. శశిథరూర్ సెల్ఫీ.. పెద్ద ఉమనైజర్ అంటూ ట్రోల్స్..!

Published : Nov 29, 2021, 02:24 PM ISTUpdated : Nov 29, 2021, 03:14 PM IST
అందమైన ఎంపీలతో.. శశిథరూర్ సెల్ఫీ.. పెద్ద ఉమనైజర్ అంటూ ట్రోల్స్..!

సారాంశం

 ఎంపీ శశిథరూర్ తాజాగా.. తన తోటి మహిళా ఎంపీలతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్, ఫోటో, నెట్టింట వైరల్ గా మారింది.  శశి థరూర్ కి ఆడవాళ్లంటే పిచ్చి అని.. అతనో పెద్ద ఉమనైజర్ అంటూ.. విపరీతంగా ట్రోల్ చేశారు. 


కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లోకి ఎక్కడం ఆయనకు చాలా కామన్. ఇక ఆయన భార్య సునంద పుష్కర్ డెత్ మిస్టరీలోనూ.. ఆయన చాలా కాలం వార్తల్లో నిలిచారు. ఆమె చావుకు ఈయనే కారణమంటూ విమర్శలు కూడా వచ్చాయి.  అయితే.. తాజాగా ఆయన.. తన తోటి ఎంపీలతో కలిసి సెల్ఫీ దిగి.. ట్రోలింగ్ కి గురవ్వడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఎంపీ శశిథరూర్ తాజాగా.. తన తోటి మహిళా ఎంపీలతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్, ఫోటో, నెట్టింట వైరల్ గా మారింది.  శశి థరూర్ కి ఆడవాళ్లంటే పిచ్చి అని.. అతనో పెద్ద ఉమనైజర్ అంటూ.. విపరీతంగా ట్రోల్ చేశారు. పని చేయడానికి.. లోక్ సభ అందమైన ప్రదేశం కాదా అంటూ.. ఈ ఆరుగురు ఎంపీలతో ఉన్న ఫోటోని ఆయన ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం.

 

"లోక్‌సభ పని చేయడానికి ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు? ఈ ఉదయం నా తోటి ఎంపీలు ఆరుగురితో: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP," అని తిరువనంతపురం ఎంపీ ట్వీట్ చేశారు.

ఇక.. నెటిజన్లు, ముఖ్యంగా బీజేపీ నేతలు.. విపరీతంగా ట్రోల్ చేయడంతో.., ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. శశిథరూర్ మరో ట్వీట్ కూడా చేయడం గమనార్హం. 

‘‘ ఈ సెల్ఫీ  (మహిళా ఎంపీల చొరవతో) చాలా  సరదాగా తీసుకున్నాం.  & అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని వారే నన్ను అడిగారు. కానీ.. ఈ ట్వీట్ విషయంలో కొందరు నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.  అయితే.. ఈ ఫోటో షేర్ చేసినందుకు మాత్రం నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. మరి ఈ వివరణతో అయినా.. ఆయనపై వస్తున్న ట్రోల్స్ కి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి. 

ఇదిలా ఉండగా.. ఈ ఫోటోలో శశిథరూర్ తో పాటు.. మహిళా ఎంపీలంతా.. పార్టీలతో సంబంధం లేకుండా.. సరదాగా నవ్వుతూ కనిపించడం విశేషం. ఈ ఫోటోలో తృణమూల్‌కు చెందిన నుస్రత్ జహాన్ , మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి ,తమిజాచి తంగపాండియా లు శశిథరూర్ తో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్