కరోనా క్లస్టర్ గా థానె వృద్ధాశ్రమం.. ఐదుగురు సిబ్బందితో సహా, 67 మందికి పాజిటివ్..

By AN TeluguFirst Published Nov 29, 2021, 2:28 PM IST
Highlights

భివండీ నగరంలోని సార్గావ్ ప్రాంతానికి చెందిన మాతో శ్రీ వృద్ధాశ్రమంలో ఇటీవల కొందరిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వైద్యుల్ని పంపి పరీక్షలు చేయించారు. ఆ ఆశ్రమంలో109 మందిని శనివారం పరీక్షించగా..  67 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో 62 మంది వృద్ధులు కాగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది.. 41 మంది ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని, 30  మందిలో ఏ లక్షణాలూ కనిపించలేదని.. జిల్లా వైద్యాధికారి  మనీష్ రేంగే  వెల్లడించారు.
 

ముంబాయి :  దేశవ్యాప్తంగా Corona virus కట్టడీలోనే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాలు హఠాత్తుగా Clustersగా మారుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది.  ఇటీవల పలు కళాశాలల్లో జరిగిన వేడుకలు.. Super Spider  ఘటనలుగా మారడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేకు చెందిన Old age home కూడా ఆ పరిస్థితుల్లోనే ఉంది. ఆ వృద్ధాశ్రమం లోని 67 మందికి కరోనా పాజిటివ్ గా తేలడం కలవరం పుట్టిస్తోంది.

భివండీ నగరంలోని సార్గావ్ ప్రాంతానికి చెందిన మాతో శ్రీ వృద్ధాశ్రమంలో ఇటీవల కొందరిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి దాంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వైద్యుల్ని పంపి పరీక్షలు చేయించారు. ఆ ఆశ్రమంలో109 మందిని శనివారం పరీక్షించగా..  67 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో 62 మంది వృద్ధులు కాగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది.. 41 మంది ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని, 30  మందిలో ఏ లక్షణాలూ కనిపించలేదని..  బాధితుల్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి  మనీష్ రేంగే  వెల్లడించారు.

అలాగే పదిహేను  నమూనాలను Genome sequencingకు పంపినట్లు తెలిపారు.  ఈ ఘటనతో వెయ్యికి పైగా జనాభా ఉన్న సార్గావ్ ప్రాంతాన్ని ప్రభుత్వం Containment zoneగా ప్రకటించింది.  అలాగే స్థానికులు అందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఇదిలా ఉండగా కొద్ది నెలలుగా Thane లో ఒకే ప్రాంతంలో ఈ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే మొదటిసారి.

కరోనా అదుపులోనే ఉందని ఊరట చెందుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో  ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆ దేశం నుంచి థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి కు చేరుకున్న ఓ వ్యక్తికి Corona positive గా నిర్ధారణ అయింది. అయితే, అది ఏ వేరియంటో తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి నమూనాల్ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగుకు పంపారు. అతడిని వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్ లో ఉంచారు.

Omicron: సౌతాఫ్రికా నుంచి ఢిల్లీ.. అటు నుంచి ముంబయి.. పాజిటివ్ తేలడంతో తోటి ప్రయాణికుల కోసం వెతుకులాట

ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి థానెకు వచ్చినా కరోనా సోకిన దక్షిణాఫ్రికా ప్రయాణికుడికి ఓమైక్రాన్ వేరియంట్‌ కరోనా వైరస్‌ ఉందో, లేదో తెలుసుకోవడానికి అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. దక్షిణాఫ్రికాలో భయంకరమైన ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ ప్రయాణికుడిని కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.

ఈ కరోనా రోగి నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చి, ఆపై ముంబైకు వెళ్లారు. దక్షిణాప్రికాకు చెందిన కరోనా రోగి పరిస్థితి నిలకడగా ఉందని కెడిఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పాన్‌పాటిల్ తెలిపారు. రోగి సోదరుడికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. రోగి ఇతర కుటుంబ సభ్యులకు సోమవారం కొవిడ్ -19 పరీక్షలు చేస్తామని పాటిల్ చెప్పారు. 

ప్రస్తుతం రోగి కుటుంబసభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. శనివారం, బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అయితే వారికి ఓమైక్రాన్ కాకుండా డెల్టా స్ట్రెయిన్ ఆఫ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

click me!