మణిపూర్ హింసపై చర్చకు పట్టు, గందరగోళం: రాజ్యసభ నుండి విపక్షాల వాకౌట్

Published : Aug 09, 2023, 04:04 PM IST
మణిపూర్ హింసపై చర్చకు పట్టు, గందరగోళం: రాజ్యసభ నుండి విపక్షాల వాకౌట్

సారాంశం

మణిపూర్ అంశంపై  రాజ్యసభలో చర్చకు విపక్షాలు  పట్టుబడ్డాయి.   తమ డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  రాజ్యసభ నుండి  వాకౌట్  చేశాయి విపక్షాలు

న్యూఢిల్లీ:మణిపూర్ అంశంపై  రాజ్యసభలో  బుధవారంనాడు రగడ చోటు  చేసుకుంది. ప్రభుత్వ తీరును  నిరసిస్తూ  రాజ్యసభ నుండి విపక్షాలు  వాకౌట్  చేశాయి.మణిపూర్ అంశంపై చర్చకు  విపక్షాలు పట్టుబట్టాయి.  బుధవారంనాడు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత  ఇదే విషయమై  విపక్షాలు  ఈ విషయమై రాజ్యసభలో  నిరసనకు దిగారు.

దీంతో  రాజ్యసభను  మధ్యాహ్నం రెండు గంటలకు  వాయిదా పడింది.  రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు  తిరిగి ప్రారంభమైంది. రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడ ఇదే విషయమై  విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో  మధ్యాహ్నం 02:45 గంటలకు  సభ వాయిదా పడింది.  సభ తిరిగి ప్రారంభమైన తర్వాత  రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మణిపూర్ అంశంపై  చర్చకు డిమాండ్  చేశారు.  

మణిపూర్ హింసపై  రాజకీయం కాదు  చర్చ కావాలని కేంద్ర మంత్రి పీయూష్ విపక్షాలకు సూచించారు. విపక్ష సభ్యుల  కోరిక  మేరకు  మణిపూర్ అంశాన్ని సభలో లిస్ట్  చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్  ప్రకటించారు. అయితే  మణిపూర్ అంశంపై  ఒక్క రోజు చర్చ పెట్టాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు.కానీ 10 రోజులుగా సాగదీస్తున్నారని  ఆయన  విమర్శలు చేశారు. తమ వినతిని పట్టించుకోవడం లేదని  పేర్కొంటూ  రాజ్యసభ నుండి విపక్ష కూటమి ఇండియాకు  చెందిన ఎంపీలు రాజ్యసభ నుండి వాకౌట్  చేశారు

also read:మోడీని రావణుడితో పోల్చిన రాహుల్: స్మృతి ఇరానీ ఫైర్ ... లోక్‌సభలో బీజేపీ,విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం

.మణిపూర్ పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు  అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ప్రధాని సభకు  కూడ రావడం లేదన్నారు.  తమ మాట  వినడానికి సిద్దంగా లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుండి  వాకౌట్ చేస్తున్నామని  మల్లికార్జున ఖర్గే  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌