ఎల్లుండే రాజ్యసభ ఎన్నికలు.. తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇవే

Published : Mar 29, 2022, 02:00 PM ISTUpdated : Mar 29, 2022, 02:31 PM IST
ఎల్లుండే రాజ్యసభ ఎన్నికలు.. తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇవే

సారాంశం

ఎల్లుండి 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు రాష్ట్రాలు అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాల్యాండ్, త్రిపుర, పంజాబ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 13 రాజ్యసభ ఎంపీలు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. వారి స్థానాలను భర్తీ చేయడానికి ఈ నెల 31వ తేదీన ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.  

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 31వ తేదీన జరగనున్నాయి. ఆరు నెలల పదవీ కాలం ఉండే రాజ్యసభ ఎంపీలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కొంత మంది చొప్పున ఎన్నుకొంటారు. ఈ ఎన్నికలు జరిగినప్పుడల్లా పలు రాష్ట్రాలను కలుపుకుని జరుగుతుంటాయి. ఈ సారి 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఏప్రిల్ నెలతో ఖాళీ అవుతున్న 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31వ తేదీన (ఎల్లుండి) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి.

1) ఆరు రాష్ట్రాలు అసోం(రెండు స్థానాలు), హిమాచల్ ప్రదేశ్ (ఒక స్థానం), కేరళ (మూడు స్థానాలు), నాగాల్యాండ్ (ఒక స్థానం), త్రిపుర (ఒక స్థానం)లకు చెందిన రాజ్యసభ ఎంపీలు ఏప్రిల్ 2వ తేదీన రిటైర్ కాబోతున్నారు. కాగా, పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 9వ తేదీన రిటైర్ కాబోతున్నారు.

2) ఈ ఆరు రాష్ట్రాల్లో రిటైర్ కాబోతున్న మొత్తం 13 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది. 

3) పంజాబ్ నుంచి ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇందులో మూడు స్థానాలకు, మిగితా రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఇవి వేర్వేరు సైకిల్స్‌కు చెందిన స్థానాలు కావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

4) వచ్చే నెలలో రిటైర్ కాబోతున్న రాజ్యసభ ఎంపీలు పలువురు ప్రముఖ నేతలు ఇలా ఉన్నారు. ఏకే ఆంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ (పంజాబ్)ల నుంచి ఉన్నారు. మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ శర్మ, బజ్వా నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కాగా, గుజ్రాల్ మాత్రం శిరోమణి అకాలీ దళ్‌కు చెందిన నేత.

5) ఈ ఎన్నికలకు మార్చి 14న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన ఎన్నికలు జరగ్గా.. కౌంటింగ్ కూడా అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుంది.

6) ప్రతి రెండేళ్లకు ఆయా రాష్ట్రాలకు చెందిన మూడొంతుల రాజ్యసభ ఎంపీలు రిటైర్ అవుతారు. ఆ ఖాళీలను ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలకు నిర్వహించి పూర్తి చేస్తారు.

7) రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్యసభ ఎంపీల ఎన్నికల్లో ఓటు వేస్తారు.

8) ఎమ్మెల్యేలు ఎంత మంది రాజ్యసభ ఎంపీ అభ్యర్థులకైనా ఓటు వేయవచ్చు. కానీ, అది ప్రాధాన్యతలను అనుసరించి ఉండాలి. అంటే.. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అన్నట్టుగా ఉంటుంది.

9) తొలి ప్రాధాన్యతగా ఉన్న పోలైన ఓట్ల సంఖ్యను బట్టి రాజ్యసభ అభ్యర్థి గెలుపును సాధారణంగా ప్రకటిస్తారు. కాగా, రాజ్యసభ అభ్యర్థుల ప్రతిపాదనకూ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

10) లోక్‌సభలో మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యసభలోనూ మెజార్టీ సంఖ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?