రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు: రాష్ట్రపతికి హరివంశ్ సింగ్ లేఖ

Published : Sep 22, 2020, 11:39 AM IST
రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు: రాష్ట్రపతికి హరివంశ్ సింగ్ లేఖ

సారాంశం

రాజ్యసభ సమావేశాలను విపక్షాలు బహిష్కరించాయి. రాజ్యసభ నుండి 8 మంది ఎంపీలను బహిష్కరణను ఎత్తివేయడంతో పాటు మరో రెండు డిమాండ్లను  విపక్షాలు సభ ముందుంచారు.


న్యూఢిల్లీ:  రాజ్యసభ సమావేశాలను విపక్షాలు బహిష్కరించాయి. రాజ్యసభ నుండి 8 మంది ఎంపీలను బహిష్కరణను ఎత్తివేయడంతో పాటు మరో రెండు డిమాండ్లను  విపక్షాలు సభ ముందుంచారు.

మంగళవారం నాడు  రాజ్యసభ ప్రారంభమైన తర్వాత గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యసభ నుండి సోమవారం నాడు  సస్పెండ్ చేసిన ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహారించుకోవాలని కోరారు..  ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది.

also read:సస్పెన్షన్‌కు గురైన ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ ఛైర్మెన్: రాజ్యసభ నుండి కాంగ్రెస్ వాకౌట్

ఇతర విపక్షాలు కూడ రాజ్యసభకు హాజరుకాబోమని ప్రకటించాయి. సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు సభకు హాజరుకాబోమని విపక్షాలు ప్రకటించాయి.అయితే సభ్యులను తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు చెప్పారు. 

సభ నడిచే విధంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య సహకారం ఉండాలని మాజీ ప్రధాని దేవేగౌడ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తేదీన రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్ సింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు లేఖ రాశాడు.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు