Rajnath Singh: "ఆయ‌న తెర‌వెనుక క‌థానాయ‌కుడు"

By Rajesh KFirst Published Aug 11, 2022, 5:36 AM IST
Highlights

Rajnath Singh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీల‌క‌ ప్రకటన చేశారు. అమిత్ షాను తెర వెనుక క‌థ‌నాయ‌కుడ‌ని అభివర్ణించాడు. అలాగే ఆయ‌న ఎలాంటి క్రెడిట్ కోసం తాపత్రయపడకుండా పనిచేశానని చెప్పుకోచ్చారు. 
 

Rajnath Singh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంస‌లు కురిపించారు. కేంద్ర హోంమంత్రి తెరవెనుక నాయ‌కుడు అని అభివర్ణించారు. అమిత్ షా ఎలాంటి క్రెడిట్ కోసం తాపత్రయపడకుండా ప‌నిచేస్తార‌ని  రాజ్‌నాథ్ అన్నారు. తన జీవితంలో ప్ర‌తి అనుభవాన్ని ఎదుర్కొన్నాడ‌నీ, తన విధుల్లో స్థిరంగా ఉంటాడ‌ని పేర్కొన్నారు. షా రాజకీయాలు, ఆధ్యాత్మికత యొక్క అరుదైన సమ్మేళనం అని అన్నారు. వివిధ సమస్యలపై షా చేసిన ప్రసంగాల సమాహారమైన "శబ్దంష్" పుస్తకాన్ని రాజ్‌నాథ్ సింగ్ విడుద‌ల చేశారు. ఆయ‌న రాజకీయాలు, ఆధ్యాత్మికతల‌ను మిళితం చేశారని, అతని అధ్యయన పరిధి చాలా మందిని ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. ఆయ‌న‌ను చదవడానికి చాలా సమయం ప‌డుతుంద‌నీ,  షా జీవితం ఒక ప్రయోగశాల అని, ఆయ‌న జీవితంలో పులుపు, తీపి, చేదు వంటి అనేక‌ అనుభవాలున్నాయ‌ని  రాజ్‌నాథ్ అన్నారు. 

సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ.. ఆయ‌న ఈ కేసులో చాలా నెలలు జైలులో గడపవలసి వచ్చిందని అన్నారు. తర్వాత కోర్టు తీర్పుతో అన్ని ఆరోపణల నుండి షా విముక్తి పొందాడ‌ని, వివిధ దర్యాప్తు సంస్థలు తనను చాలా వేధించాయని రక్షణ మంత్రి అన్నారు.  గుజరాత్ అల్లర్ల కేసును ప్రస్తావిస్తూ.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేశారని అన్నారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. నిజానిజాలు బయటకు వస్తాయని షా విశ్వాసం వ్యక్తం చేశారని అన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడంపై పార్టీ నిరసనలు చేయ‌డాన్ని రాజ్‌నాథ్ సింగ్ త‌ప్పుబ‌ట్టారు. దర్యాప్తు సంస్థ షాకు సమన్లు ​​పంపినప్పుడల్లా తాను వెళ్లానని చెప్పారు. ఆ స‌మ‌యంలో బీజేపీ ఎలాంటి అల్ల‌ర్లు సృష్టించ‌లేద‌ని, ఎటువంటి ఉద్యమాన్ని ప్రారంభించలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, బీజేపీ నేతలిద్దరిపై ఫెడరల్ ఏజెన్సీలు విచారణ చేశాయ‌ని గుర్తు చేశారు.

ప్రతి సవాళ్లు తనను (షా) మరింత బలపరిచాయని రాజ్‌నాథ్ అన్నారు. ప్రశంసలు, అప్రతిష్టలతో సంబంధం లేకుండా తన విధులను అనుసరించాడు. రాజకీయాలు, ఆధ్యాత్మికత కలయిక చాలా అరుదుగా కనిపిస్తుంది, ఇలాంటి క‌ల‌యిక‌ను షాలో ఉంటుందని అన్నారు. సమాజాన్ని సన్మార్గంలోకి తీసుకురావడమే రాజకీయాలకు అర్థమని, అయితే ఆ పదానికి అర్థం లేకుండా పోయిందని.. రాజకీయాలను, నాయకులను ప్రజలు ప్రతికూలంగా చూస్తున్నారని అన్నారు. రాజకీయాల యొక్క ఈ నిజమైన లక్ష్యాన్ని పునరుద్ధరించే దిశగా షా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

click me!