PM Modi: నిరాశ, నిస్పృహలతో చేత‌బ‌డిని ఆశ్ర‌యిస్తున్నారు .. ప్ర‌ధాని మోడీ షాకింగ్ కామెంట్స్ 

By Rajesh KFirst Published Aug 11, 2022, 3:36 AM IST
Highlights

PM Modi: ఇటీవ‌ల కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేప‌ట్టిన‌ నిరసన ప్రదర్శనపై ప్ర‌ధాని మోడీ స్పందించారు. బ్లాక్ మ్యాజిక్ ను నమ్ముకునేవాళ్లు ఎప్పటికీ ప్రజల నమ్మకాన్ని పొందలేరని వ్యాఖ్యానించారు. 
 

PM Modi: దేశ‌వ్యాప్తంగా చెలారేగుతున్న‌ నిర‌స‌న రాజ‌కీయాల‌పై ప్రధాని మోదీ తీవ్రంగా మండిప‌డ్డారు. మన దేశంలో కూడా కొంత మంది ప్రతికూల సుడిగుండంలో చిక్కుకుని నిరాశలో మునిగితేలుతున్నారని అన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు మాయమాటలు చెప్పే ప్రయత్నం ఎలా జరిగిందో ఆగస్టు 5న చూశామ‌ని అన్నారు. 

పానిపట్‌లో రూ.909 కోట్లతో 35 ఎకరాల్లో రెండో తరం (2జీ) ఇథనాల్ ప్లాంట్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శాస్త్రాలు సంధించారు. 

ఇటీవల కాంగ్రెస్ నేతలు నల్ల దుస్తులు ధరించి..  కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టడంపై ప్ర‌ధాని మోడీ స్పందించారు. ప్రదర్శనలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు నల్ల బట్టలు ధరించడంపై ప్రధాని మోదీ హేళన చేశారు.

నిరాశ, నిస్పృహల కాలం మునిపోయిన కొంద‌రూ.. చేతగానితనంతో బ్లాక్ మ్యాజిక్ ను ఆశ్రయిస్తున్నారు. ఆగస్టు 5న కొందరు ఇలాగే బ్లాక్ మ్యాజిక్ ప్రచారం పొందడానికి ప్రయత్నించడం చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే తమలోని నిరాశా నిస్పృహలు వీడిపోతాయని భావిస్తున్నారేమోన‌నీ మోదీ హేళ‌న చేశారు.  

నిరాశ, నిస్పృహలతో కొంత‌మంది మునిపోయార‌నీ, అలాంటి వారు ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పినా..  వారిని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని ప్రధాని మోదీ అన్నారు. అటువంటి వారు నిరాశలో చేతబడి వైపు మొగ్గు చూపుతున్నారని ఎద్దేవా  చేశారు. వారు ఎంతటి చేతబడి చేసినా.. మూఢనమ్మకాలను నమ్మినా.. వారు మాత్రం ప్రజల విశ్వాసాన్ని పొంద‌లేర‌ని అన్నారు. 

అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. ప్ర‌తి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగ‌ర‌వేయాల‌ని పిలుపునిచ్చామ‌నీ, ఈ పవిత్ర సందర్భాన్ని పరువు తీయడానికి, మన వీర స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచే ప్రయత్నం జరిగిందని విమ‌ర్శించారు. ఇలాంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు.
 

click me!