లైవ్ లో విషం తాగి కరుడు గట్టిన బీజేపీ అభిమాని ఆత్మహత్యాయత్నం.. మోడీ వల్లే అంటూ విమర్శలు..

Published : Feb 10, 2022, 11:44 AM IST
లైవ్ లో విషం తాగి కరుడు గట్టిన బీజేపీ అభిమాని ఆత్మహత్యాయత్నం.. మోడీ వల్లే అంటూ విమర్శలు..

సారాంశం

తన మరణానికి ప్రధాని నరేంద్ర మోడీనే కారణం అంటూ.. కరుడు గట్టిన బీజేపీ అభిమాని ఒకరు ఆరోపించారు. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ ఈ ఘటన కలకలం రేపుతోంది. రాజకీయ హీట్ ను పెంచుతోంది. 

ఉత్తరప్రదేశ్ : Coronaతో కోట్లాదిమంది బతుకులు తలకిందులయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. Lock downతమ జీవితాలను తలకిందులు చేసింది అంటూ.. బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్ తోమర్ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడీ ఉదంతం రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరుడుగట్టిన BJP అభిమాని కాస్త విమర్శలు విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచేసింది.

ఉత్తరప్రదేశ్లోని బాపట్లకు చెందిన బూట్లు వ్యాపారి రాజీవ్ తోమర్ (40)దంపతులు లైవ్లో poison తాగి suicideకు ప్రయత్నించారు.  మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే,  ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన Facebook Live లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని Narendra Modiపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోడీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్.

భార్య అడ్డుకుంది కానీ…
నోట్ల రద్దు జిఎస్టి వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్ వీడియోలో రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోడీ  ఎంత మాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. రాజీవ్  విషం తీసుకుంటుండగా ఆయన భార్య అడ్డుకోబోయింది. ఆ టైంలోనూ ఆమె తీవ్రంగా ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వం నాలాంటి వాళ్ళ మాట వినడం లేదు..  కనీసం నువ్వైనా విను’  అంటూ విసురుగా విషయం తాగేశారు. భర్త విషం తాగడంతో హతాశురాలైన ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకుంది.

కాసేపటికి లైవ్ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్లుగా నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో  తీసుకున్న రుణాలు చెల్లించే వీలు లేకపోయిందన్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బిజెపి అభిమాని నుంచి…
రాజీవ్ తోమర్ కరుడుగట్టిన బిజెపి అభిమాని.. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫోటోలు ఉండడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. 

అయితే బిజెపి మాత్రం వ్యక్తిగత కారణాలను.. పార్టీని నిందించటం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతోమంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజు వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు.

ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు.. నేను మీతో ఉన్నాను.. అంటూ రాజీవ్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఇలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free Health Care : పేదలకు పండగే.. ఉచిత వైద్యంలో నెంబర్ వన్.. చరిత్ర సృష్టించిన శ్రీ మధుసూదన్ సాయి మెడికల్ కాలేజీ!
Mallikarjun Kharge Reacts to Exit Polls: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ షాకింగ్ రిజల్ట్ | Asianet Telugu