ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలన్న ప్రధాని మోదీ

Published : Apr 07, 2022, 10:35 AM ISTUpdated : Apr 07, 2022, 10:38 AM IST
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలన్న ప్రధాని మోదీ

సారాంశం

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి సూచనలపై తక్షణ చర్యలు ప్రారంభించాలని కోరుతూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు.  

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో, విధానాల్లో గమనించిన లోపాలను తెలియజేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులను ప్రధాన మంత్రి కోరారు. శనివారం కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో మోదీ ఈ మేరకు సూచనలు చేశారు. ఉద్యోగాల కల్పనకు మోదీ సూచనలు చేసినట్టుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలియజేశారు.

ఉద్యోగాల కల్పనకు ఊతం ఇచ్చేందుకు ప్రయివేటు రంగానికి చేయూతనివ్వాలని, మంత్రిత్వ శాఖలు, శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లుగా రాజీవ్ గౌబా తెలిపారు. ఏప్రిల్ 2న కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రధానమంత్రి సూచనలపై తక్షణ చర్యలు ప్రారంభించాలని కోరుతూ రాజీవ్ గౌబా కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు.

‘‘మానుఫ్యాక్చరింగ్, ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వడానికి.. భారతీయ కంపెనీలు ప్రపంచ అగ్రగామిగా మారడానికి సహాయపడటానికి ప్రైవేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించేలా తక్షణ చర్యలు అవసరం’’ అని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం "ఫెసిలిటేటర్"గా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెబుతూ.. లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ‘ప్రతి మంత్రిత్వ శాఖ/విభాగాలు మంజూరైన పోస్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. 

పని చేసే ధోరణిని మార్చుకోవాలని అని స్పష్టం చేశారు. ముఖ్యమైన సమస్యలను మొత్తం ప్రభుత్వ విధానం ద్వారా పరిష్కరించాలని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమావేశంలో ప్రధానమంత్రి సూచించిన రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాల స్థాయిలో దాని ప్రాముఖ్యతను తగిన విధంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ఇక, శనివారం జరిగిన సమావేశంలో పలువురు కార్యదర్శులు.. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ప్రజాకర్షక పథకాలతో ఆయా రాష్ట్రాలు భవిష్యత్తులో శ్రీలంకవంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక రాష్ట్రంలో ప్రకటించిన పథకం ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని చెప్పారు. ఇక, మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.7 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో రాజ్యసభకు తెలియజేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?