రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళిని జైల్లోనే ఆత్మాహత్యాయత్నం

By narsimha lodeFirst Published Jul 21, 2020, 10:01 AM IST
Highlights

దివంగత మాజీ  ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న నళిని  సోమవారం నాడు రాత్రి జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
 

దివంగత మాజీ  ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న నళిని  సోమవారం నాడు రాత్రి జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ హత్య కేసులో ఆమె 29 ఏళ్లుగా జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మహిళల జైలులో నళిని గత 29 ఏళ్లుగా ఉంటున్నారు. ఆమె సోమవారంనాడు  రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా ఆమె లాయర్ పుగలేథి చెప్పారు.

గత 29 ఏళ్లలో ఇలాంటి తీవ్రమైన నిర్ణయానికి నళిని పాల్పడిందని ఆయన తెలిపారు. జైలులో నళిని మరో  దోషితో గొడవ పడినట్టుగా చెప్పారు. ఈ గొడవ విషయాన్ని జైలర్ దృష్టికి ఇతర ఖైదీలు తీసుకెళ్లారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యాయానికి పాల్పడినట్టుగా పుగలేథి తెలిపారు.

also read:రాజీవ్ గాంధీ హత్య: నళిని పెరో‌ల్‌పై జైలు నుండి విడుదల

గతంలో ఏనాడూ కూడ నళిని ఇలా చేయలేదని ఆమె  లాయర్ చెప్పారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి అసలు కారణాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు.నళినిని వేలూరు జైలు నుండి పుజల్ జైలుకు మార్చాలని ఆమె భర్త మురుగన్  కోరినట్టుగా లాయర్ చెప్పారు. ఈ విషయమై న్యాయపరమైన అభ్యర్థనను చేస్తామన్నారు. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని సహా మరో ఏడుగురికి స్పెషల్ టాడా కోర్టు శిక్షను విధించింది. 1991 మే 21వ తేదీన రాజీవ్ గాంధీని ఆత్మాహుతి బాంబు దాడి ద్వారా ఎల్టీటీఈ హత్య చేసింది. ఈ కేసులో వీరికి శిక్ష విధించింది. స్పెషల్ టాడా కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది కోర్టు.

click me!