వైద్యుల నిరాకరణ.. ఆటోలో మహిళ ప్రసవం, శిశువు మృతి

By telugu news teamFirst Published Jul 21, 2020, 9:25 AM IST
Highlights

అక్కడ బెడ్స్ ఖాళీగా లేవంటూ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి  విక్టోరియా ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వా త అక్కడి నుంచి కేసీ జనరల్ ఆస్పత్రికి వెళ్లింది.

ఆమె నిండు గర్భిణీ.. పురిటి నొప్పులతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆటోలో ఆస్పత్రికి బయలుదేరింది. అయితే.. ఆమె పరిస్థితి తెలిసి కూడా ఆస్పత్రి నిర్వాహకులకు కనికరం కలగలేదు. దాదాపు మూడు ఆస్పత్రులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. కాగా.. పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ పురిటినొప్పులతో బాధపడుతూ.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. ముందుగా శ్రీరామపుర ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా..  అక్కడ బెడ్స్ ఖాళీగా లేవంటూ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి  విక్టోరియా ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వా త అక్కడి నుంచి కేసీ జనరల్ ఆస్పత్రికి వెళ్లింది. 

మూడు ఆస్పత్రుల్లోనూ బెడ్స్ ఖాళీగా లేవనే కారణంతో ఆమెను చేర్పించుకోలేదు. దాదాపు ఆరు గంటలపాటు ఆమె పురిటినొప్పులతో బాధపడింది. ఎక్కడా ఆమెను చేర్పించుకోలేదు. దీంతో.. తాను వచ్చిన ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. అయితే... పుట్టిన బిడ్డ వెంటనే చనిపోయాడు. కాగా.. దీనిని స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.

అది కాస్త ముఖ్యమంత్రి సిద్ధారామయ్య దృష్టికి వెళ్లింది. దీంతో.. ఈ ఘటనపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ట్విట్టర్ వేదికగా ఆదేశించారు. అయితే.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇతరులకు చికిత్స అందివ్వడానికి ఆస్పత్రులు ముందుకు రావడం లేదు.

కాగా..దీనిపై సైతం ముఖ్యమంత్రి స్పందించారు. కర్ణాటక రాష్ట్రంలో.. కరోనా సోకని వారి మరణాలు ఎక్కువయ్యాయని.. కేవలం ఆస్పత్రిలో చికిత్స అందకమాత్రమే వారు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం అయితే.. ఆ హాస్పిటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. 


 

click me!