
రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త వేధింపులు తట్టుకోలేక ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. అంత్యంత క్రూరంగా అతని మీద పగతీర్చుతుంది. మధ్యలో అతనికి స్పృహ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లేకపోతే అందరూ ఆ భార్య చెప్పిందే నిజమని నమ్మేవారు. ఇంతకీ అసలే జరిగిందంటే..
రోజు భర్త పెట్టే హింసలను ఆ భార్య తట్టుకోలేకపోయింది. ఇంటికి రావడమే ఆలస్యం... ఏదో ఓ వంకతో తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడు. దీంతో జీవితంతో విసిగిపోయిన ఆ భార్య ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే దారుణమైన ప్లాన్ వేసింది. భర్తకు మత్తుమందిచ్చి ఆ తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి పగ తీర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్ లో సంచలనంగా మారింది.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. దాని ప్రకారం... మహేంద్ర ధన్ (32) అనే వ్యక్తి బికనీర్ లో నివసిస్తున్నాడు. అతనికి భార్యతో తరచుగా గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పని నుంచి ఇంటికి రాగానే అతడికి భార్య భోజనం పెట్టింది.
భోజనం చేసిన తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. అయితే, తరువాత ఎలక్ట్రికల్ షాక్ తగలడంతో మెలుకువ వచ్చింది. ఎదురుగా భార్య చేతులకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని కరెంట్ షాక్ ఇస్తోంది. మహేంద్ర కాళ్లకు కరెంటు వైర్లు చుట్టూ ఉన్నాయి. మెలుకువ వచ్చేటప్పటికీ... వరుసగా కరెంట్ షాక్ ఇవ్వడంతో మహేంద్ర మళ్లీ స్పృహ కోల్పోయాడు.
రెండోరోజు తిరిగి స్పృహ వచ్చే సమయానికి మహేంద్ర కాళ్లు కాలిపోయి ఉన్నాయి. అతను హాస్పిటల్ బెడ్ మీద కట్టేసి ఉన్నాడు. అతడి తండ్రి సోదరుడు తన వద్ద ఉన్నారు. ఏమని అడిగితే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మహేంద్ర కు కరెంట్ షాక్ తగిలింది అతని భార్య వారికి ఫోన్ చేసి పిలిపించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు మొత్తం వివరాలను చెప్పగా... వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.