టెన్త్ ఎగ్జామ్ రాసిన మాజీ ముఖ్యమంత్రి... 86యేళ్ల వయసులోనూ తగ్గని ఆసక్తి....

Published : Aug 19, 2021, 04:13 PM IST
టెన్త్ ఎగ్జామ్ రాసిన మాజీ ముఖ్యమంత్రి... 86యేళ్ల వయసులోనూ తగ్గని ఆసక్తి....

సారాంశం

ర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదో తరగలి ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్ మెంట్ కేసులో 2013లో ఆయనకు 10యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

చండీగఢ్ : చదువుకోవడానికి వయసుతో పనిలేదన నిరూపిస్తూ 86యేళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే అలా రాసింది.. మామూలు వ్యక్తో అయితే కొంత విశేషం.. కానీ ఏకంగా ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఈ వార్త మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదో తరగలి ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్ మెంట్ కేసులో 2013లో ఆయనకు 10యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

చౌతాలా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు కూడా రాశారు. అయితే, అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు. ఆ తర్వాత హర్యానా ఓపెన్ ఎడ్యుుకేషన్ బోర్డ్ 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్ట్ 5న ఆ పరీక్షల ఫలితాలు రాగా చౌతాలా ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్ లో ఉన్న ఆయన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని తెలిపింది. 

దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. తాను ప్రస్తుతం విద్యార్థినని, రాజకీయాలకు సంబంధించినవి మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, చౌతాలా ఓ సహాయకుడిని పెట్టుకోవడానికి బోర్డును అభ్యర్థించి అనుమతి పొందీ పరీక్ష పూర్తి చేశారు. 2017లో తన 82యేండ్ల వయస్సులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4శాతం మార్కులు సాధించారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ