వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నా.. 87 వేల మందికి కరోనా, కేరళలోనే తీవ్రత అధికం

By Siva KodatiFirst Published Aug 19, 2021, 4:38 PM IST
Highlights

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ సైతం మహమ్మారి సోకుతున్నట్లు నిపుణులు  గుర్తించారు. ఇందులో కేరళ మొదటిస్థానంలో వున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 
 

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ సైతం మహమ్మారి సోకుతున్నట్లు నిపుణులు  గుర్తించారు. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 87 వేల మందికి కరోనా వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అందులో ఒక్క కేరళలోనే దాదాపు 46 శాతం మంది దాకా ఉన్నారని అంటున్నారు.

కేరళలో మొదటి డోసు తీసుకున్న 80 వేల మందికి కరోనా సోకగా.. రెండు డోసులు తీసుకున్న 40 వేల మంది మరోసారి పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా వస్తుండడం, ఇప్పుడు బ్రేక్ త్రూ కేసులూ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:గత 24 గంటల్లో ఇండియాలో 36,401 కరోనా కేసులు: మొత్తం 3.23 కోట్లకు చేరిన కేసులు

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 200 బ్రేక్ త్రూ కేసుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. అయితే, ఆ శాంపిళ్లలో ఎలాంటి జన్యుపరివర్తన జరిగినా కరోనా మూలాలు లేవని తేల్చారు. కేరళలో బ్రేక్ త్రూ కేసులు పెరిగిపోతుండడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులపైనా ఫోకస్ పెట్టింది

click me!