రక్తమోడిన రాజస్థాన్ రహదారులు.. స్పాట్ లోనే ఏడుగురి దుర్మ‌ర‌ణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు 

By Rajesh KFirst Published Aug 20, 2022, 2:58 AM IST
Highlights

రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది గాయపడ్డారు. 
 

రాజ‌స్థాన్ లో ఇవాళ రహదారులు రక్తమోడాయి.   పాలి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు  చనిపోయారు. దాదాపు  20మందికి పైగా గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం రాత్రి సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌దేవ్రాకు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ట్రాలీ బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో దాదాపు 7 మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

20కి పైగా ప్రమాదాల్లో గాయపడ్డారు

శుక్రవారం సాయంత్రం పాలి జిల్లాలోని సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, రామ్‌దేవ్రాకు వెళ్తున్న  ట్రాక్టర్‌ను అదుపుతప్పి ట్రైలర్  బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 నుంచి 25 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సుమేర్‌పూర్‌, శివగంజ్‌ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
 
సమాచారం అందుకున్న సుమేర్‌పూర్‌ పోలీసులు సహా జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం స‌మీపంలోకి ఆస్పత్రిల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలంలో గాయపడిన వారి కేకలు వినిపిస్తున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా, జిల్లా కలెక్టర్ డాక్టర్ భన్వర్ లాల్ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల‌ను ప‌ర‌మ‌ర్శించారు. బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు.

click me!