వైద్యరంగలో భారత్ మరో ముందడుగు.. మంకీపాక్స్‌ నిర్ధారణకు స్వదేశీ కిట్‌ విడుదల

Published : Aug 20, 2022, 02:33 AM ISTUpdated : Aug 20, 2022, 02:37 AM IST
వైద్యరంగలో భారత్ మరో ముందడుగు.. మంకీపాక్స్‌ నిర్ధారణకు స్వదేశీ కిట్‌ విడుదల

సారాంశం

మంకీపాక్స్ స్వ‌దేశీ  కిట్: ప్రపంచ దేశాల‌ను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌ టెక్‌ జోన్ (ఏఎంటీజెడ్)లో తయారైంది. దేశంలో తయారైన తొలి మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ ఇదే కావడం విశేషం.  

మంకీపాక్స్ స్వ‌దేశీ  కిట్: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా అప్ర‌మ‌త్త‌మైంది. అదే సమయంలో మంకీపాక్స్‌ను నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటుంది.  ఈ క్రమంలో మంకీపాక్స్ పరీక్షించడానికి దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి ఆర్టీ- పీసీఆర్ కిట్‌ను శుక్రవారం (ఆగస్టు 18) ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్ (AMTZ) లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ దీన్ని ప్రారంభించారు. ఈ స్వదేశీ కిట్‌ను ట్రాన్సాసియా బయోమెడికల్స్ అభివృద్ధి చేసింది.

ఈ సంద‌ర్భంగా ట్రాన్స్ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ వజిరాణి మాట్లాడుతూ..  'ఈ కిట్ సహాయంతో మంకీపాక్స్ ను ముందుగానే గుర్తించవచ్చు. Trans Asia Erba Monkeypox RT PCR కిట్ చాలా సున్నితమైనది కానీ ఉపయోగించడానికి సులభమైనది. ఇది ఇన్‌ఫెక్షన్‌లను ముందస్తుగా గుర్తించి మెరుగైన నిర్వహణకు తోడ్పడుతుందని సురేష్ వజిరాణి తెలిపారు.

భారతదేశంలో 10 మంకీపాక్స్ కేసులు

భారతదేశంలో ఇప్పటి వరకు 10 కోతుల వ్యాధి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మంకీపాక్స్ కి  గురైన వ్యక్తులలో యాంటీబాడీస్ ఉనికిని తనిఖీ చేయడానికి సెరో-సర్వే నిర్వహించవచ్చు. దీనితో పాటు, వారిలో ఎంత మందికి ఇన్ఫెక్షన్ లక్షణాలు లేవని కూడా ఐసీఎంఆర్ కనుగొనవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ఎమర్జెన్సీగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.
 
పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఏమి చెప్పిందో తెలుసుకోండి

మరోవైపు..ఆఫ్రికా ప్రజారోగ్య సంస్థ అధిపతి మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆఫ్రికన్ ప్రాంతాల నుండి మంకీపాక్స్ వ్యాధికి పేరు మార్చడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మంకీపాక్స్ పేరును మార్చడానికి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ  గత వారం తెలిపింది. కాంగో బేసిన్ అని పిలవబడే వ్యాధి రూపాన్ని ఇప్పుడు క్లాడ్ 1 అని పిలుస్తారు. గతంలో వెస్ట్ ఆఫ్రికా వేరియంట్ అని పిలిచే దానిని ఇప్పుడు క్లాడ్ 2 అని పిలుస్తారు. దీని వల్ల వ్యాధికి సంబంధించిన కళంకం తొలగిపోతుందని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu