Operation Sindoor: భారత్ దాడుల తరువాత రాజస్థాన్ లో వాటిని మూసేశారు

Published : May 07, 2025, 11:36 AM IST
Operation Sindoor: భారత్ దాడుల తరువాత రాజస్థాన్ లో వాటిని మూసేశారు

సారాంశం

పాకిస్తాన్‌లో వైమానిక దాడి అనంతరం రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించగా, పాఠశాలలకు సెలవులు ఇచ్చి పరీక్షలు వాయిదా వేశారు.

భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై బాంబులు విసిరిన తర్వాత, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బికనీర్, జైసల్మేర్, బార్మర్ వంటి సరిహద్దు జిల్లాల్లో పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. శత్రుదేశం ప్రతిస్పందనపై అనుమానంతో అక్కడ హై అలర్ట్ అమలులోకి వచ్చింది.

భారత్ మాతా కీ జై..

బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో విద్యార్థుల భద్రత దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షల తేదీలను కూడా వాయిదా వేశారు. విద్యాశాఖ అధికారులు పిల్లల భద్రతకే మొదట ప్రాధాన్యతనిచ్చారు.జైసల్మేర్, బార్మర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున నుండి యుద్ధ విమానాల శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కానీ ఇది భారత్ దాడి చేసినట్టు అధికారికంగా తెలిసిన తర్వాత, ప్రజలలో ఆనందం వెల్లివిరిచింది. వీధుల్లో పటాకులు పేలుతూ, 'భారత్ మాతా కీ జై' నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజలను ప్రశాంతంగా ఉండమని, అసత్య వార్తలను నమ్మకండని సూచించింది. భద్రతా బలగాలు పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నాయని సమాచారం. ప్రజలు మీడియా ద్వారా అధికారిక సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?