నేను శివుడిని, నిన్ను చంపి బతికిస్తా..: మద్యం మత్తులో వృద్దురాలిన హత్య చేసిన వ్యక్తి

Published : Aug 07, 2023, 01:42 AM IST
నేను శివుడిని, నిన్ను చంపి బతికిస్తా..: మద్యం మత్తులో వృద్దురాలిన హత్య చేసిన వ్యక్తి

సారాంశం

రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వృద్ధుడు మద్యం మత్తులో మతి భ్రమించినవాడిగా మారాడు. తనను తాను శివుడి అవతారం అని హెల్యుజనేట్ అయ్యాడు. ఓ వృద్ధురాలిని దారుణంగా చంపేశాడు. ఆమెను చంపి తిరిగి బతికించగలనని భ్రమపడ్డాడు.  

ఉదయ్‌పూర్: రాజస్తాన్ నుంచి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఓ వృద్ధుడు.. దారిన పోతున్న ఓ వృద్ధురాలిని కూర్చోబెట్టుకుని ఉన్నపళంగా ఊహించని విధంగా ఆమె ఛాతిలో కొట్టాడు. ఆమె కిందపడిపోయింది. నేలపై పడిపోయిన ఆ వృద్ధురాలిని గొడుగుతో దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధురాలు మరణించింది. ఇందుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వృద్ధుడు తనను తాను శివుడి అవతారం అని భ్రమించాడు. తాను ఆ వృద్ధురాలిని చంపి మళ్లీ జీవం పోయగలను అని హెల్యుజనేట్ అయ్యాడు. ఈ హత్య వెనుక క్షుద్రపూజల కోణం లేదని స్పష్టం చేశారు. మద్యం మత్తులోనే ఆ వృద్ధుడు అలా మతి భ్రమించినవాడిగా మారాడని వివరించారు.

ఈ ఘటన ఉదయ్‌పూర్ జిల్లాలోని గిరిజనులు ఉండే కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. 85 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వేరే గ్రామానికి వెళ్లుతున్నది. ఈ క్రమంలో దారి పక్కనే ఉన్న 60 ఏళ్ల ప్రతాప్ సింగ్‌కు దగ్గరగా వెళ్లాల్సి వచ్చింది. కల్కి బాయి గమేతిని ప్రతాప్ సింగ్ ఆపాడు. తాను గొప్ప శివ భక్తుడినని ఆమెతో చెప్పాడు. శివుడే తనను ఆమె దగ్గరకు పంపించానని వివరించాడు. ఆ తర్వాతనే తానే శివుడి అవతారం అని అన్నాడు. నీవొక రాణివి అని చెబుతూ ఆమె ఛాతిలో బలంగా గుద్దాడు.

Also Read: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆ వృద్ధురాల నేలపై పడిపోయింది. జుట్టు పట్టుకుని లాక్కెళ్లాడు. గొడుగు తీసుకుని ఆమెను దారుణంగా కొట్టాడు. అక్కడే ఇద్దరు మైనర్లు, ఓ వ్యక్తి ఉన్నారు. మైనర్లు వీడియో తీశారు. ఆ వ్యక్తిని వృద్ధుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఉదయ్ పూర్ ఎస్పీ భువన్ భూషణ్ మాట్లాడుతూ.. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారని వివరించారు. ఆ వృద్ధుడు హెల్యుజనేట్ అయినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. ప్రతాప్ సింగ్ తనను తాను శివుడి అవతారం అని నమ్మించుకున్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కల్కి బాయిని చంపేసి మళ్లీ ఆమెను రక్షించగలననీ భ్రమించాడని వివరించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu