చంద్రుడిని వీడియో తీసిన చంద్రయాన్ 3, ఇస్రో విడుదల చేసిన ఆ వీడియో ఇదే

Published : Aug 06, 2023, 11:10 PM IST
చంద్రుడిని వీడియో తీసిన చంద్రయాన్ 3, ఇస్రో విడుదల చేసిన ఆ వీడియో ఇదే

సారాంశం

చంద్రయాన్ 3 నుంచి గ్రేట్ అప్‌డేట్ వచ్చింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లుతుండగా చంద్రయాన్ 3 జాబిల్లిని తన కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన 45 సెకండ్ల వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోను వీక్షించింది.  

న్యూఢిల్లీ: చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన చంద్రయాన్ 3 మిషన్.. తాజాగా, జాబిల్లి వీడియోను తీసింది. దాని చుట్టూ తిరుగుతూ తీసిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ వీడియోలో చంద్రుడు అతి దగ్గరగా కనిపిస్తున్నాడు. చంద్రుడి ఉపరితలంపై గల బిలాలు కనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలో తిరుగుతుండగా ఈ వీడియో తీసింది. వెలుగు వైపు నుంచి చంద్రుడికి చీకటి వైపు వెళ్లుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపించింది. సూర్యకిరణాలు పడ్డ వైపే చందమామ ప్రకాశిస్తాడన్న విషయం తెలిసిందే. 45 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పుడే కింద తిలకించండి.

ఆగస్టు 1వ తేదీన ఈ మిషన్ భూ కక్ష్య నుంచి చిరకాలం దూరంగా జరిగిపోయింది. ఆగస్టు 5వ తేదీన అది చంద్రుడి కక్ష్యకు సమీపంగా వెళ్లింది. అప్పుడు బర్న్ చేసుకుని తనను తాను చంద్రుడి కక్ష్యలోకి తోసుకుంది. ఈ సమయంలో చంద్రుడిని రికార్డు చేసిన వీడియోనే ఇప్పుడు ఇస్రో విడుదల చేసింది. 

చంద్రుడిపై సాఫ్ట్‌గా ల్యాండ్ కావాలనే లక్ష్యంతో ఇస్రో గత నెల 14వ తేదీన శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి చేరనుంది. ఇందుకు భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకోనుంది. అందుకే చంద్రుడిపైకి మిషన్ దీర్ఘ సమయం తర్వాత చేరుతుంది.

Also Read: రేపు అధికార లాంఛనాలతో గద్ధర్ అంత్యక్రియలు .. ఎక్కడ అంటే, అంతిమయాత్ర ఇలా..?

ముందు భూమి చుట్టూ కక్ష్యను పెంచుకుంటూ దూరంగా జరుగుతుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి వెళ్లుతుంది. చంద్రుడి చుట్టూ కక్ష్యను తగ్గించుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యను అందుకున్న తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ దాని నుంచి వేరవుతుంది. మిషన్ అప్పుడు చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. అన్ని సజావుగా జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ మిషన్ ల్యాండ్ కావాలి. ఇక వృత్తాకార కక్ష్యలో తిరిగే ప్రొపల్షన్ మాడ్యూల్ పై ఉండే ఏకైక పేలోడ్ భూగ్రహాన్ని అబ్జర్వ్ చేస్తూ.. అక్కడి నుంచి సిగ్నల్స్‌ను ఇస్రోకు అందించే ఒక రిలేలా పని చేస్తుంది. చంద్రయాన్ 2లో పంపిన ఆర్బిటర్ ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతున్నది. అవసరమైతే దాన్ని కూడా అక్కడి నుంచి సిగ్నల్స్‌ను పొందడానికి ఉపయోగించుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu