పగబట్టిన పాము! మొదటిసారి కాటేస్తే ట్రీట్‌మెంట్, నిలిచిన ప్రాణాలు.. రెండో సారి కాటేయడంతో వ్యక్తి మృతి

Published : Jul 01, 2023, 01:41 PM ISTUpdated : Jul 01, 2023, 01:51 PM IST
పగబట్టిన పాము! మొదటిసారి కాటేస్తే ట్రీట్‌మెంట్, నిలిచిన ప్రాణాలు.. రెండో సారి కాటేయడంతో వ్యక్తి మృతి

సారాంశం

రాజస్తాన్‌లో పాము ఓ వ్యక్తిని చచ్చిపోయే వరకు కాటు వేసింది. తొలిసారి వేసిన కాటుకు చికిత్స పొంది హాస్పిటల్ నుంచి ఆ వ్యక్తి ఇంటికి తిరిగిరాగానే.. మరుసటి రోజే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈ సారి ప్రాణాలు దక్కలేవు.  

జైపూర్: రాజస్తాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఎడారి ప్రాంతానికి చెందిన పాము ఓ వ్యక్తి ప్రాణాలు తీసేదాకా వదల్లేదు. మొదటి సారి కాటేస్తే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని ప్రాణాలతో డిశ్చార్జ్ అయ్యాడు. కానీ, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మరుసటి రోజు మరోసారి ఆ వ్యక్తి పాముకాటుకు గురయ్యాడు. దీంతో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో మెహ్రన్‌గఢ్ గ్రామంలో చోటుచేసుకుంది.

మెహ్రన్‌గఢ్‌కు చెందిన 44 ఏళ్ల జసబ్ ఖాన్ జూన్ 20వ తేదీన పాముకాటుకు గురయ్యాడు. వెంటనే ఆయనను పోఖ్రాన్‌లోని హాస్పిటల్ తరలించారు. అక్కడ ఆయన నాలుగు రోజులు చికిత్స తీసుకున్నారు. జూన్ 25న డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు మరోసారి ఆయన కాలికి పాము కాటు వేసింది. ఈ సారి వెంటనే హాస్పిటల్ తరలించారు. కానీ, ఈ సారి ఆయన ప్రాణాలు దక్కలేవు. మొదటి పాము కాటు నుంచే ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే రెండో పాము కాటుకు గురవ్వడంతో ఆయన బాడీ తట్టుకోలేదని వైద్యులు తెలిపారు. రెండోసారి కాటు వేసిన పామును స్థానికులు చంపేశారు.

Also Read: పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?

44 ఏళ్ల జసబ్ ఖాన్‌కు భార్య, తల్లి, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి బాధ్యుడు ఆయనే. జసబ్ ఖాన్ మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !