మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 25మంది ప్రయాణికులు సజీవ దహనం...

Published : Jul 01, 2023, 07:14 AM IST
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 25మంది ప్రయాణికులు సజీవ దహనం...

సారాంశం

మహారాష్ట్రలో ఘోరమైన బస్సు ప్రమాదంలో 25మంది సజీవ దహనం అయ్యారు. టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.నాగ్ పూర్-పూణె హైవే మీద బస్సు వెల్తుండగా.. బస్సు టైర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాద సయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. గుల్దానా సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గుల్దానాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు నాగ్ పూర్ నుంచి ఫూణె వెడుతుండగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు