మహిళా సర్పంచిని అవమానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

By ramya NFirst Published Mar 20, 2019, 11:16 AM IST
Highlights

కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే.. ఓ మహిళా సర్పంచిని అవమానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే.. ఓ మహిళా సర్పంచిని అవమానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ నుంచి తనను గెలిపించిన ప్రజలకు దన్యవాదాలు చెప్పేందుకు జోద్పూర్ ఎమ్మెల్యే దివ్య మదేర్న మంగళవారం ఖేటసార్ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చందు దేవి కూడా హాజరయ్యారు. అయితే.. సదరు సర్పంచ్ వేదిక ఎక్కి ఎమ్మెల్యే పక్కన కూర్చవాలని అనుకున్నారు.

కానీ.. ఎమ్మెల్యే దివ్య మాత్రం సర్పంచ్ ని అవమానించారు. కింద కూర్చోవాలంటూ సూచించారు. కాగా.. ఆమె అలా  చెబుతుండగా తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో.. వివాదం గా మారింది. ఎమ్మెల్యే తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి.. మరో మహిళా సర్పంచ్‌ను ఇలా అవమానించడం మంచి పద్దతి కాదంటూ రాజస్తాన్‌ ​సర్పంచ్‌ సంఘ్‌ నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాక సదరు ఎమ్మెల్యే చందూ దేవికి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

 ఈ విషయం గురించి ఎమ్మెల్యే దివ్య మదేర్న మాట్లాడుతూ.. ‘సదరు సర్పంచ్‌ బీజేపీకి చెందిన మహిళ. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో ఆమెను వేదిక మీదకు ఎలా ఆహ్వానిస్తాం’ అని ప్రశ్నించారు.

ఆ తర్వాత మాట మారుస్తూ.. ‘చందు దేవి ముఖంపై ముసుగు వేసుకుని ఉన్నారు. ఆమెను నేను గుర్తు పట్టలేదు. చందు దేవి కూడా అదే గ్రామానికి చెందిన సాధరణ మహిళ అనుకున్నాను. ఆమె వేదిక  మీదకు వచ్చి నా పక్కన కూర్చోబోతుండటం చూసి నాకు ఏదైనా హానీ చేస్తుందేమోనని భావించి కింద కూర్చోమని చెప్పాను’ అని తెలిపారు. నెటిజన్లు కూడా ఎమ్మెల్యే తీరుపై పెదవి విరుస్తున్నారు.

click me!