ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన సీఎం... రెండుసార్లు జరిమానా

By ramya NFirst Published Mar 19, 2019, 12:49 PM IST
Highlights

రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యి ఉండి.. ఆయనే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించారు. అయితే.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. రూల్స్ అతిక్రమించింది సీఎం అని కూడా చూడకుండా ఆయన జరిమానా విధించారు.

రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యి ఉండి.. ఆయనే ట్రాఫిక్ రూల్స్ ని అధిగమించారు. అయితే.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. రూల్స్ అతిక్రమించింది సీఎం అని కూడా చూడకుండా ఆయన జరిమానా విధించారు. ఒక్కసారి కాదు.. ఇలా రెండు సార్లు జరిగింది. కర్ణాటక సీఎం కుమారస్వామికి ఈ అనుభవం ఎదురైంది.

సీఎం కుమారస్వామికి చెందిన ఎస్ యూవీ కారుపై గత నెలలో రెండుసార్లు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కాగా.. ఇప్పటివరకు దానిని చెల్లించకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసు వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల మేరకు ఫిబ్రవరి 10వ తేదీన మొబైల్ డ్రైవింగ్. 22వ తేదీన బసవేశ్వర్ సర్కిల్ సమీపంలో అతివేగతంలో వాహనం నడపడం కింద ఈ-చలానాలు జారీ అయ్యాయి. 

ఇందులో ఒకటి రూ.100 కాగా మరో చలాన్ రూ.300గా ఉంది. ఈ రెండు రోజుల్లోనూ కుమారస్వామి బెంగళూరులోనే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండురోజుల తర్వాత ఫిబ్రవరి 10న ఆడియో టేపులపై ఆయన బిజీ బిజీగా గడిపారు. ఫిబ్రవరి 22న బెంగళూరు సబర్బన్ రైల్ ప్రాజక్టుపై చర్చించేందుకు సీఎం కుమార స్వామి కేంద్రరైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను విధానసౌధలో కలుసుకున్నారు.
 
కాగా ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమేరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయనీ... అదే ప్రక్రియలో నోటీసులు కూడా జారీ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 

click me!