మద్యం ప్రియులకు భారీ షాక్.. పెరగనున్న ధరలు

By telugu news teamFirst Published May 1, 2020, 12:13 PM IST
Highlights

 లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిందని, ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 


ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ ఇప్పటికే నెలరోజులకు పైగా విధించారు. మరిన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మద్యం ప్రియులకు ఆల్కహాల్ దొరకక ఇబ్బందిపడుతున్నారు.

అయితే.. ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మద్యం ప్రియులకు వారికి కావాల్సినంత మద్యం దొరకనుంది. అయితే.. ధర మాత్రం వాచిపోతుందని తెలుస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిందని, ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ఈ మేరకు కసరత్తులు మొదలుపెట్టింది. మద్యం విక్రయాలపై ఎక్సైజ్ డ్యూటీని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇండియా మేడ్ ఫారిన్ మద్యంతోపాటు బీరుపై 35 శాతం, ఇతర లిక్కర్ విక్రయాలపై 45 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు ఎక్పైజ్ డ్యూటీ పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని రాజస్థాన్‌ సర్కార్ పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ యాక్ట్ 1950 సెక్షన్ 28 ప్రకారం మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయన్నారు. దీంతో రాష్ట్రాల ఆదాయాలు భారీగా పడిపోతున్నాయని ఈ క్రమంలోనే రాజస్థాన్ సర్కార్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

click me!