ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఓ ఎయిర్ హోస్టెస్ శవమై తేలింది. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి చూస్తే ఎయిర్ హోస్టెస్ మృతదేహం కుళ్లిన స్థితిలో కన్పించింది.
ముంబై: ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఓ ఎయిర్ హోస్టెస్ శవమై తేలింది. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి చూస్తే ఎయిర్ హోస్టెస్ మృతదేహం కుళ్లిన స్థితిలో కన్పించింది.
ముంబైలోని పోద్దార్ వాడిలోని రాజ్యలక్ష్మి అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లో ఆమె మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని సుల్తాన్ షేక్ గా గుర్తించారు. సుల్తానాతో పాటు మరో ఇద్దరు ఈ ఫ్లాట్ లో ఉండేవారు. లాక్ డౌన్ కు ముందే సుల్తానా ఇద్దరు స్నేహితులు ముంబై విడిచి వెళ్లి పోయారు. ఈ ఫ్లాట్ లో సుల్తానా ఒక్కతే ఉంది.
ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో ఆమె పనిచేస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో విమానాలు కూడ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో విధులకు కూడ సుల్తానా హాజరుకావడం లేదు. అయితే బుధవారం నాడు రాత్రి ఆమె ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
also read:దారుణం:ఆస్తి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య
సుల్తానా ఎలా మృతి చెందిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కూడ లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.