దారుణం:ఆస్తి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

By narsimha lode  |  First Published May 1, 2020, 10:47 AM IST

ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన తర్వాత ఓ వ్యక్తి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. తన తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులను ఆస్తి కోసం హత్య చేశాడు నిందితుడు.



న్యూఢిల్లీ: ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేసిన తర్వాత ఓ వ్యక్తి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. తన తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులను ఆస్తి కోసం హత్య చేశాడు నిందితుడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు చోటు చేసుకొంది.

ఆస్తి వివాదానికి సంబంధించి  26 ఏళ్ల అజయ్ సింగ్ గురువారం నాడు తన తల్లి, తండ్రి, సోదరుడు, సోదరుడి భార్య, సోదరుడి ఇద్దరు పిల్లలతో గొడవకు దిగాడు. 
ఈ గొడవ తీవ్ర రూపం దాల్చింది. 

Latest Videos

also read:కరోనా రోగులకు ఇంట్యూబేషన్ బాక్సులు: ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణ

కోపం పట్టలేక అజయ్ సింగ్ తనతో తెచ్చుకొన్న కత్తితో ప్రత్యర్ధి కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

మృతులను అమర్, రామ్ సఖి, అరుణ్, రామ్‌దులరి, సురభ్, సారికలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీస్ కమిషనర్ సుర్జీత్ పాండే చెప్పారు. 
 

click me!