Narendra Modi:విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో మోడీ సంభాషణ

By narsimha lode  |  First Published Nov 30, 2023, 12:26 PM IST


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర  లబ్దిదారులతో  నరేంద్ర మోడీ సంభాషించారు. మహిళా సంఘాలకు  డ్రోన్లను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


న్యూఢిల్లీ: విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారంనాడు  సంభాషించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు  డ్రోన్లను  అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అంతేకాదు  డియోఘర్  ఎయిమ్స్ లో  10వేల జన ఔషది కేంద్రాన్ని కూడ  ఆయన ప్రారంభించనున్నారు.  

జనఔషది కేంద్రాలను  పది వేల నుండి 25 వేలకు పెంచాలని  కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గురువారంనాడు  10వ  జనఔషది కేంద్రాన్ని ఆయన  ప్రారంభించనున్నారు.

Latest Videos

 డియోఘర్ లోని జన ఔషది సెంటర్ డైరెక్టర్ రుచికుమారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తున్న విషయాన్ని  రుచి  కుమారి మోడీకి చెప్పారు.  జార్ఖండ్ రాష్ట్రంలోని  రామ్‌గడ్  జిల్లాలో తన స్వగ్రామమని ఆమె మోడీ దృష్టికి తెచ్చారు.  పేద, మధ్యతరగతి ప్రజలకు జనఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు  లభ్యమౌతున్నాయని రుచి కుమారి చెప్పారు.

also read:Narendra Modi.. మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రం: ఈ నెల 30న ప్రారంభించనున్న నరేంద్ర మోడీ

జన ఔషధి కేంద్రం నుండి మందులు కొనుగోలు చేసిన వ్యక్తితో కూడ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు.  గతంలో తనకు  మందుల కొనుగోలుకు  రూ. 12 నుండి  రూ. 13 వేలు ఖర్చయ్యేదన్నారు. కానీ తనకు జన ఔషధి కేంద్రాల ద్వారా  రూ 3 నుండి మూడున్నర వేలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన  వివరించారు.

 

click me!