కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే

By Siva Kodati  |  First Published Mar 20, 2020, 5:36 PM IST

సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆమెతో పాటు లక్నోలో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి


సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆమెతో పాటు లక్నోలో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ‌వంటి ఎంపీలు కూడా హాజరయ్యారు.

లక్నోలో ఉన్నప్పుడు తన కుమారుడు దుష్యంత్ అతని అత్తమామలతో పాటు తాను విందుకు హాజరయ్యానని, దురదృష్టవశాత్తూ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన సింగర్ కనికా కూడా ఇదే విందుకు హాజరయ్యారు. దీంతో తన కుమారుడు, తాను వెంటనే స్వీయ నిర్బంధాన్ని తీసుకున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వసుంధరా రాజే ట్వీట్ చేశారు.

Latest Videos

undefined

Also Read:కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకు బార్లు, దుకాణాలు సహా అన్నీ మూత

బేబీ డాల్ వంటి బాలీవుడ్ హిట్ పాటలు పాడిన కనికి కపూర్ తాను పార్టీకి ఆతిథ్యం ఇచ్చానని మీడియా చేసిన వార్తలను ఖండించారు. అయితే లక్నోలో మంత్రులు, బ్యూరోక్రాట్లతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు 200 మంది ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తోంది.

కనికా కూపర్ మార్చి 9న లండన్ నుంచి ముంబై వచ్చారు. అక్కడ రెండు రోజుల తర్వాత లక్నో‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. ముంబై విమానాశ్రయంలో జరిగిన స్క్రీనింగ్‌లో ఆమెకు కోవిడ్-19 లక్షణాలు బయటపడలేదని ఆమె తెలిపారు.

Also Read:మందుబాబుల్లో ఫుల్లుగా కరోనా అవగాహన: క్యూ లైన్లలోనే క్వారంటైన్!

అయితే మూడు రోజుల క్రితం గొంతు నొప్పి వచ్చింది. కనికాకు ఈ ఉదయం జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

దీంతో కనికాను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో కనికా తల్లిదండ్రులు, సహాయకులను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించారు. 

click me!