నిర్భయ కేసు: ఆ నలుగురు దోషుల సంపాదన ఎంతో తెలుసా?

By narsimha lodeFirst Published Mar 20, 2020, 4:29 PM IST
Highlights

నిర్భయ కేసులో నలుగురు దోషులు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు.శుక్రవారం నాడు ఉదయం ఐదున్నర గంటలకు నలుగురు దోషులకు తీహార్ జైలులో ఉరి తీశారు

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు.శుక్రవారం నాడు ఉదయం ఐదున్నర గంటలకు నలుగురు దోషులకు తీహార్ జైలులో ఉరి తీశారు. జైలులో  ఉన్న రోజుల్లో ఈ నలుగురు దోషులు సుమారు రూ. 1.37 లక్షలు సంపాదించారని జైలు వర్గాలు చెబుతున్నాయి.

నిర్భయ కేసులో నలుగురు దోషులు తీహార్ జైల్లో శిక్షను అనుభవించారు. 2012 డిసెంబర్ 16వ తేదీన నలుగురు నిర్భయపై గ్యాంగ్ రేప్ పై పాల్పడ్డారు. ఈ కేసులో దోషులు తీహార్ జైల్లో ఉన్నారు. అక్షయ్ కుమార్ రూ. 69 వేలు, పవన్ గుప్తా రూ. 29 వేలు, వినయ్ శర్మ రూ. 39 వేలు, అయితే ముఖేష్ సింగ్ మాత్రం ఎలాంటి పని చేయడానికి ముందుకు రాలేదని సమాచారం.

also read:నిర్భయ కేసు: ఎప్పుడు ఏం జరిగిందంటే?

ఈ నలుగురు దోషులు 23 దఫాలు జైలు నిబంధనలను ఉల్లంఘించినట్టుగా జైలు వర్గాలు చెబుతున్నాయి.  జైలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వినయ్ శర్మ 11 దఫాలు అక్షయ్ ఠాకూర్ ఒక్క సారి శిక్షను అనుభవించారు. ముఖేష్ సింగ్ మూడు దఫాలు, పవన్ గుప్తాలు ఎనిమిది సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. 

2016 లోనే ముఖేష్, పవన్, అక్షయ్ ఠాకూర్ లు టెన్త్ ఆడ్మిషన్ తీసుకొన్నారు. కానీ ఈ ముగ్గురు పాస్ కాలేదు. 2015లో వినయ్ డిగ్రీ అడ్మిషన్ తీసుకొన్నారు. కానీ, డిగ్రీ పూర్తి చేయలేదు.

click me!