పోలింగ్ బూత్‌లో తొక్కిసలాట, కారుకు నిప్పు

By sivanagaprasad KodatiFirst Published Dec 7, 2018, 11:31 AM IST
Highlights

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బికనీర్ జిల్లా కొలయాత్ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక వర్గానికి చెందిన వారు కారుకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొడుతున్నారు. 

అయితే పోలింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు జలోర్ నియోజకవర్గంలోని అహోర్‌లో 253, 254 నెంబర్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఆందోళనకు దిగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్‌ శాసనసభలో... రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.

మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలిసారిగా మహిళల కోసం 200 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
 
Rajasthan: Voters create ruckus at polling booth no. 253 and 254 in Ahor constituency of Jalore as voting has been halted following EVM malfunction. pic.twitter.com/v67aloFU9B

— ANI (@ANI)
click me!