ఓటువేయడానికి ముందు పూజలు చేసిన హోంమంత్రి

Published : Dec 07, 2018, 10:36 AM IST
ఓటువేయడానికి ముందు పూజలు చేసిన హోంమంత్రి

సారాంశం

ఈ రోజు ఉదయం 10గంటలకు రాజస్థాన్ హోం శాఖామంత్రి గులాబ్ చంద్ కటారియా ఉదయ్ పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

తెలంగాణతోపాటు.. రాజస్థాన్ లో కూడా శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లోనూ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కాగా.. ఈ రోజు ఉదయం 10గంటలకు రాజస్థాన్ హోం శాఖామంత్రి గులాబ్ చంద్ కటారియా ఉదయ్ పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ముందు ఆయన ఉదయ్ పూర్ లోని ఓ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌నేత అశోక్‌ గెహ్లోత్‌ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అంతకు ముందు ఆయన ‘‘ఓటు అనేది కేవలం మీ హక్కే కాదు. మీ నైతిక బాధ్యత’’ అని ట్విటర్‌ ద్వారా ప్రజలకు పిలపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?